వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిరీష కేసులో మరో సంచలనం: లోదుస్తులపై ఆ మరకలేంటి? అత్యాచారం జరిగిందా?

బ్యుటీషియన్‌ శిరీష ఆత్మహత్య కేసులో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. మరణించిన సమయంలో ఆమె ధరించిన లోదుస్తులపై మరకలను గుర్తించిన పోలీసులు ఆమెపై అత్యాచారం జరిగి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బ్యుటీషియన్‌ శిరీష ఆత్మహత్య కేసులో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. మరణించిన సమయంలో ఆమె ధరించిన లోదుస్తులపై మరకలను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.

కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు.. శిరీష లోదుస్తులపై మరకలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, ఫోరెన్సిక్‌ నివేదిక ఇంకా రావాల్సిఉందని, ఆ తర్వాతే అత్యాచారంపై పూర్తి నిర్ధారణకు వస్తామని తెలిపారు.

రిమాండ్ డైరీ చెప్పిన నిజాలు...

రిమాండ్ డైరీ చెప్పిన నిజాలు...

శిరీష ఆత్మహత్య కేసులో నిందితులైన శ్రవణ్‌, రాజీవ్‌లు ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈనెల 12న అర్ధరాత్రి కుకునూర్‌పల్లి పోలీస్‌ క్వార్టర్‌లో చోటుచేసుకున్న విషయాలను సైతం పోలీసులు రిమాండ్‌ డైరీలో కోర్టుకు వివరించారు.

ముందే వాట్సాప్ లో శిరీష ఫొటో...

ముందే వాట్సాప్ లో శిరీష ఫొటో...

శిరీష కేసులో ఏ1 శ్రవణ్‌... గతంలో పలుమార్లు ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి అమ్మాయిలను పంపేవాడని, సమస్య పరిష్కారం పేరుతో శిరీషను కుకునూర్‌పల్లికి తీసుకెళ్లక ముందే ఆమె ఫోటోలను ఎస్సైకి వాట్సాప్‌లో పంపాడని, అంతకముందు జరిగిన ఫోన్‌ సంభాషణల్లోనూ శిరీష అందం గురించి ఎస్సై ప్రభాకర్‌రెడ్డితో శ్రవణ్‌ మాట్లాడాడని రిమాండ్‌ డైరీలో పోలీసులు పేర్కొన్నారు.

ఒంటరిగా వదిలే ప్రయత్నం...

ఒంటరిగా వదిలే ప్రయత్నం...

కుకునూర్‌పల్లిలో కూడా ఆ రోజు రాత్రి సెక్స్‌వర్కర్ల దగ్గరికి వెళ్లాలని ఎస్సై ప్రభాకర్‌రెడ్డి.. రాజీవ్‌, శ్రవణ్‌లను క్వార్టర్స్‌నుంచి బయటికే పంపే ప్రయత్నం చేయగా, అందుకు రాజీవ్‌ కూడా ఆసక్తి ప్రదర్శించాడని పోలీసులు పేర్కొన్నారు. దీంతో శ్రవణ్‌.. సిగరెట్‌ నెపంతో రాజీవ్‌ను బయటికి తీసుకెళ్లాడని వారు తెలిపారు.

ప్రతిఘటించిన శిరీష...

ప్రతిఘటించిన శిరీష...

గదిలో ఒంటరిగా చిక్కిన శిరీషను ఎస్సై ప్రభాకర్‌రెడ్డి దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయగా, ఆమె ప్రతిఘటించిందని తెలిపారు. ‘సాయం కోసం వస్తే ఇలా చేస్తున్నారేమిటి..'అంటూ శిరీష ఎస్సై ప్రభాకర్ రెడ్డిని నిలదీసిందని.. ‘నేను అలాంటిదాన్ని కాదం'టూ ఎస్సైని వెనక్కి నెట్టేసిందని, అయినాసరే ప్రభాకర్‌రెడ్డి వినకుండా మళ్లీ దగ్గరకు వెళ్లడంతో శిరీష బిగ్గరగా కేకలు వేసింది..' అని రిమాండ్‌ డైరీలో పోలీసులు పేర్కొన్నారు.

English summary
The death of beautician Sirisha is still a mystery in Hyderabad. The remand report of Rajeev and Sravan, who were found accused in the death case of beautician Sirisha, has come out with sensational revelations. Police in the remand reports said that stain marks have been found in the dress of Sirisha and added that it gives an indication that she became a victim of rape. Police have again made it clear that after a forensic report only, one could say that rape has been committed or not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X