ఇతనే: తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిపై అర్థరాత్రి రేప్ (వీడియో)
హైదరాబాద్: సికింద్రాబాదులోని చిలుకలగూడలో దారుణమైన సంఘటన జరిగింది. తల్లిపక్కన నిద్రిస్తున్న ఏడాది చిన్నారిపై అర్ధరాత్రి సమయంలో బంధువు అత్యాచారం చేశాడు. కేసుకు సంబంధించిన వివరాలను మహంకాళి ఏసీపీ ఎస్.గంగాధర్ బుధవారం వివరించారు.
ఉత్తర్‌ప్రదేశ్ కనోజ్ జిల్లా సతార్ గ్రామానికి చెందిన దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి చిలుకలగూడ దూద్‌బావిలో నివాసం ఉంటున్నారు. తోపుడు బండిపై మొక్కజొన్న కంకులు ఉడికించి అమ్ముతూ జీవిస్తున్నారు. కొన్ని రోజుల కిందట నగరానికి వచ్చిన బంధువు దీప్‌సింగ్ (20) వీరి ఇంట్లోనే ఉంటూ మొక్కజొన్న కంకుల వ్యాపారం చేస్తున్నాడు.

ఇదిలావుంటే, బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో పిల్లలతో పాటు దంపతులు నిద్రిస్తుండగా దీప్‌సింగ్ చడిచప్పుడు కాకుండా ఒకటిన్నర ఏళ్ల వయస్సుగల చిన్నారిని బాత్‌రూమ్‌లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. తిరిగి పాపను తల్లితండ్రుల వద్ద వదిలి నిద్రపోయాడు. బాధను తట్టుకోలేక పాప ఏడుస్తుండగా తల్లితండ్రులు నిద్రలేచి పాపను ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అత్యాచారం జరిగిందని నిర్ధారించారు.
దీంతో చిన్నారి తల్లిదండ్రులు వెంటనే చిలుకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి దీప్‌సింగ్‌ను విచారించగా నేరాన్ని అంగీకరించాడు. మహంకాళి డివిజన్ ఏసీపీ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ కావేటి శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications