తెలంగాణలో సీక్రెట్ వాటర్ ఫాల్స్.. అడ్వెంచర్ లవర్స్ కు బెస్ట్ స్పాట్..

తెలంగాణలో అనేక ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. అనేక చారిత్రక కట్టడాలు, రాతి కోటలు, పురాతన ఆలయాలు, అడవులు, వన్యప్రాణి కేంద్రాలు, జలపాతాలు, ట్రెక్కింగ్ స్పాట్లు ఇలా అనేక టూరిస్టు ప్రాంతాలు పర్యటకులను కనువిందు చేస్తున్నాయి. అయితే తెలంగాణలో జలపాతాలు అనగానే బొగత వాటర్ ఫాల్స్, కుంతల జలపాతం, గాయత్రి జలపాతం, కనకాయ్ జలపాతం, గుండాల జలపాతం, పొచ్చెర జలపాతం, భీముని పాదం జలపాతం, సప్త గుండాల జలపాతం.. ఇవే గుర్తుకువస్తాయి. కానీ చాలా తక్కువ మందికే తెలిసిన సీక్రెట్ జలపాతం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

ఈ జలపాతం రాష్ట్రంలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం మంగవాయిగూడెంలోని ఒంటిమామిడి లోధి జలపాతం. ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ కొత్త అడ్వెంచర్ స్పాట్ గా మారింది. దీనినే స్థానికంగా ఒంటిమామిడి జలపాతం అని కూడా పిలుస్తారు. ఈ వాటర్ ఫాల్స్ దట్టమైన అడవుల మధ్య దాగి ఉంది. అందువల్లనే చాలా తక్కువ మందికి దీని వివరాలు తెలుసు. ఇటీవల అడ్వెంచర్ లవర్స్ కారణంగా ఈ జలపాతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బిజీ లైఫ్ కు దూరంగా పచ్చని కొండలు, అడవుల మధ్య ప్రశాంతంగా ఉండే ఈ ప్లేస్ అడ్వెంచర్ చేయాలనుకునేవారికి పర్ ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

ఒంటిమామిడి జలపాతాన్ని చేరుకోవడం అంత సులభం కాదు. కేవలం అటవీ మార్గం గుండానే ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఈ ప్రయాణం పూర్తిగా అడ్వెంచర్ తో కూడుకుని ఉంటుంది. అలాగే ప్రమాదకరమైన దారి గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. అడవిలోని వాగులు, వంకలు దాటుకుంటూ మోకాళ్ల లోతు బురదలో నడుస్తూ అక్కడకు చేరుకోవాలి. ఇక ఈ జలపాతాన్ని సందర్శించాలంటే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు.

Ontimamidi Waterfall Mulugu district renowned as one of Telangana s secret waterfalls prime spot

ఎలా చేరుకోవాలంటే..? ముందుగా టూరిస్టులు మంగవాయిగూడెం లేదా వెంకటాపురం చేరుకోవాలి. అక్కడి మెయిన్ రోడ్డు నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరం అడవిలో ప్రయాణించాల్సి ఉంటుంది. మట్టి రోడ్డులో ప్రయాణం ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ చూసేందుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. సాయంత్రం నాలుగు లోపు జలపాతాన్ని సందర్శించి తిరిగి రావడం బెటర్. రాత్రి పూట అడవిలో ప్రయాణం ప్రమాదకరంగా ఉంటుంది. ఇక ఈ ప్రాంతం హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే వరంగల్ నుంచి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+