బలమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ - పెరిగిన రెవిన్యూ వసూళ్లు..!!

తెలంగాణ ఆర్దిక శక్తిగా ఎదుగుతోది. కేంద్రం నుంచి మద్దతు లేకపోయినా స్వయంగా గణనీయ వృద్ధి రేటును నమోదు చేస్తున్నది. కాగ్‌ మొదటి త్రైమాసిక నివేదికను వెల్లడించింది. అందులో తెలంగాణ ఏటికేడు ఆర్థికంగా బలపడుతున్న తీరును వర్ణించింది. వనరులను సద్వినియోగం చేసుకొంటూ ఆర్థికంగా బలపడుతున్నది. రాబడిలో ఎక్కువ మొత్తం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసమే రాష్ట్రం వెచ్చిస్తోంది. ఆర్దిక నిర్వహణలో ఆదర్శంగా నిలుస్తోంది.

ప్రణాళికా బద్దంగా:తెలంగాణ ప్రభుత్వ ఆర్ధికంగా బలోపేతం దిశగా ప్రణాళికా బద్దంగా ముందుకెళ్తోంది. కాగ్‌ మొదటి త్రైమాసిక నివేదికను వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ రూపాల్లో రాష్ర్టానికి రూ.2,59,861.91 కోట్లు సమకూరుతుందని బడ్జెట్‌లో అంచనా వేసింది. మొదటి త్రైమాసికంలో అంటే.. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో కలిపి మొత్తం రూ.50,910.11 కోట్లు ఖజనాకు చేరాయి. అంటే.. బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే ఇప్పటికే సుమారు 20 శాతం ఆదాయం సమకూరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,45,256.61 కోట్లు సమకూరుతాయని బడ్జెట్‌లో అంచనా వేయగా, నిరుడు జూన్‌ వరకు రూ.43,550.51 కోట్లు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సారి రూ.7,359.6 కోట్లు అధిక ఆదాయం సమకూరింది.

Opinion: A total of Rs 50,910.11 crore has reached the TS treasury in the first quarter in 2023-24

ఏటికేడు బలపడుతూనే :తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులివ్వకుండా కేంద్రం కొర్రీలు పెడుతుతోంది. తెలంగాణ మాత్రం ఆర్థికంగా ఏటికేడు బలపడుతూనే ఉంది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో జీఎస్టీ రాబడే అగ్రస్థానంలో నిలిచింది. అమ్మకం పన్ను రూపంలో రూ.7,532.96 కోట్లు, కేంద్ర పన్నుల వాటా రూ.2,988.88 కోట్లు, పన్నేతర రాబడి రూ.1,488.10 కోట్లు రాబడి వచ్చింది. ప్రధాన వ్యయాలను పరిశీలిస్తే రెవెన్యూ ఖాతా ఖర్చు రూ.15,406.89 కోట్లు ఉన్నది. వేతనాల కోసం రాష్ట్రం వెచ్చించింది రూ.9,796.83 కోట్లు. రాష్ట్రంలోని వివిధ వర్గాలకు పింఛన్ల రూపంలో రూ.4,158.57 కోట్లు వెచ్చించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి జీఎస్టీ రూపంలో రూ.50,942.49 కోట్లు వస్తుందని ఆర్థిక అంచనా వేయగా, మొదటి త్రైమాసికానికి రూ.11,418.47 కోట్లు వసూలైంది. బడ్జెట్‌ అంచనాల్లో ఇది 22 శాతంగా నమోదైంది.

Opinion: A total of Rs 50,910.11 crore has reached the TS treasury in the first quarter in 2023-24

ఆర్దికంగా బలమైన శక్తిగా:స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపంలో రూ.18,500 కోట్లు వస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ అంచనా వేయగా, జూన్‌ నాటికి రూ. 3,510.63 రాబడి సమకూరింది. ఇలా.. జూన్‌ నెల వరకు రాష్ర్టానికి రూ.50,910.11 కోట్లు సమకూరగా, అన్నింటికీ కలిపి రూ.47,290.64 కోట్లను రాష్ట్రం ఖర్చు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రూపం లో రూ.42,189.47 కోట్లు వస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ అంచనా వేయగా.. మొదటి త్రైమాసికానికి రూ. 9,645.14 కోట్లు వచ్చింది.గత ఏడాదితో పోలిస్తే జీఎస్టీ రూ.1,773.33 కోట్లు అధిక రాబడి వచ్చింది. తొమ్మిదేళ్ల కాలంగా పక్కా ప్రణాళికా బద్దంగా వేస్తున్న అడుగులతో రాష్ట్రం ఆర్దికంగా బలమైన శక్తిగా ఎదగటానికి అవకాశం దక్కింది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలోనూ అదే విధంగా ముందుకు దూసుకెళ్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+