కొండంత భరోసా - ఆర్దిక ఆసరా: ప్రజల ఖాతాల్లోకి రూ 4.46 లక్షల కోట్లు..!!

తెలంగాణ ఆవిర్భావం తరువాత గ్రామాల రూపురేఖలు మారాయి. గ్రామీణ ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయి. గ్రామీణ జనాభా కోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇచ్చాయి. గ్రామాల్లో వ్యవసాయం రికార్డులు తిరగరాస్తోంది. సంక్షేమ పథకాలతో పల్లెల్లో స్థితిగతుల్లో మార్పు తెచ్చాయి. ప్రభుత్వం ఇస్తున్న భరోసా..అందిస్తున్న ఆర్దిక ఆసరా మొత్తంగా గ్రామాల పురోగతికి తోడ్పాటు అందిస్తున్నాయి. ఎనిమిదేళ్ల కాలంలో గ్రామీణ ప్రజల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా రూ 4.46 లక్షల కోట్లు అందించింది.

నేరుగా ప్రజల ఖాతాల్లోని నగదు జమ:ఈ ఎనిమిదేళ్ల కాలంలో ప్రజల ఖాతాల్లోకి సంక్షేమ పథకాల నగదును ప్రభుత్వం జమ చేసింది. ఈ మొత్తం రూ 4.46 లక్షల కోట్లుగా ఉంది. అందులో ప్రధానంగా రైతుబంధు ద్వారా రూ 65,481కోట్లు, రైతు రుణ మాఫీ కోసం రూ 17,351 కోట్లు, ఆసరా ఫించన్లు రూ 57,650 కోట్లు, ఉపాధి హామీ కూలీ నిధులుగా రూ 27,825 కోట్లు అందించారు. వీటితో పాటుగా రైతుబీమా కింద రూ.5,384 కోట్లు, కల్యాణలక్ష్మి కింద రూ.8,182 కోట్లు,
షాదీముబారక్‌ కోసం రూ.1,902 కోట్లు, దళిత బంధు కోసం రూ 4,404 కోట్లు, ఆరోగ్య శ్రీ కింద రూ 8 వేల కోట్లు, కేసీఆర్ కిట్ కోసం రూ 1,420 కోట్లు అందించారు. ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కింద రూ. 70,965 కోట్లు, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కోసం రూ. 37,779 కోట్లు అందచేసారు. ధాన్యం కొనుగోలు కోసం రూ 1,21,000 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా 4,46,276 కోట్లను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది.

Opinion: KCR govts financial guarantee, 4.46 lakh cr DEBT in the last 8 years

మౌళిక వసతుల కోసం రూ 3.94 లక్షల కోట్లు:సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ 4.46 లక్షల కోట్లు విడుదల చేయగా, మరో 3.94 లక్షల కోట్లు గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల పథకాల కోసం ఖర్చు చేసింది. దీంతో మొత్తంగా ఎనిమిదేళ్ల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ ప్రభుత్వం రూ 8.41 లక్షల కోట్లు వెచ్చించింది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు తక్కువగా రెండు నుంచి మూడు లక్షల వరకు పలికిన వ్యవసాయ భూముల ధరలు ఇప్పుడు ఎక్కడ చూసినా రూ 25 లక్షల పైమాటే. ప్రాజెక్టులతో సాగుకు నీటి కొరత తీరిపోయింది. విద్యుత్ సమస్యలు పరిష్కారమయ్యాయి. ఫలితంగా రికార్డు స్థాయి పంటలు పండుతున్నాయి. ఫలితంగా కొనుగోలు శక్తి పెరటంతో పాటుగా ఆర్దిక శక్తి బలోపేతం అయింది. గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యత పెరిగింది. నీతి అయోగ్ లెక్కల ప్రకారం వృద్ధి రేటు అయిదు రెట్లు పెరిగింది. గత మార్చితో ముగిన ఆర్దిక సంవత్సరానికి పెట్టుబడి వ్యవయం రూ 61,343 కోట్లకు చేరింది.

డీబీటీతో సత్ఫలితాలు:ప్రత్యక్ష నగదు బదిలీ పథకం అమలు ద్వారా గ్రామీణ ప్రజలీ జీవన స్థితి గతుల్లో అనూహ్య మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి ఇస్తున్న భరోసా వారికి ధైర్యాన్నిస్తోంది. ఆర్దికంగా ఆసరగా నిలుస్తున్న పథకాలత తో పూర్తి మార్పు కనిపిస్తోంది. గ్రామాల్లో పంట భూముల ధరలు పెరగటంతో ఒక్క సారిగా ఆర్దికంగా గణనీయ మార్పు కనిపిస్తోంది. వ్యవసాయం చేస్తున్న వారి ఇంట సంతోషం కనిపిస్తోంది. సంక్షేమ పథకాలు.. ప్రభుత్వ తోడ్పాటు కొనుగోలు శక్తి పెరగానికి కారణంగా నిలుస్తున్నాయి. ప్రతీ గ్రామంలో రాబడి..ఆదాయం పెరిగాయి. గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత వారికి కలిసి వస్తోంది. మొత్తంగా ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణ గ్రామీణ ఆర్దిక ముఖచిత్రంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+