ఆత్మగౌరవ ప్రతీకగా, లక్ష్యం దిశగా- గెలుపుపై కేసీఆర్ ధీమా వెనుక..!!

తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. హ్యాట్రిక్ లక్ష్యంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టేలా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒకసారి 115 మంది అభ్యర్ధులను ప్రకటించారు. ఇదే సమయంలో పదేళ్ల కాలంలో తాను చేసిన సంక్షేమం..అభివృద్ధి గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, హైదరాబాద్ లో అభివృద్ధి, పెట్టుబడులు పాజిటివ్ ఓట్ బ్యాంక్ ను పెంచాయనే విశ్వాసంతో కనిపిస్తున్నారు.

సంక్షేమమే ఆయుధంగా
కేసీఆర్ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. లక్షలాది మంది లబ్దిదారులు ఈ పథకాలతో ప్రయోజనం పొందుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలోనూ గణనీయ మార్పు కనిపిస్తోంది. పెట్టుబుడుల, తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం ముందంజలో ఉంది. రెవిన్యూ వసూళ్లు పెరిగాయి. ఈ సారి జరిగే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ తో మరోసారి సీఎం పీఠం దక్కించుకోవాలనే సీఎం కేసీఆర్ అసలు లక్ష్యం.

kcr

ఇప్పుడు గ్రేటర్ పరిధిలో పేదలకు లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా..తాజాగా గ్రేటర్‌ పరిధిలోని 24 నియోజకవర్గాలకు చెందిన 11,700 మంది లబ్ధిదారులకు తొమ్మిది ప్రాంతాల్లో పత్రాలను అందజేశారు. దశలవారీగా మిగిలిన ఇండ్లను అర్హులందరికీ పంపిణీ చేస్తామని మంత్రులు భరోసా ఇచ్చారు.

గత ప్రభుత్వాల కంటే మెరుగ్గా
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఇటీవల 68,632 ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా... మిగిలిన వాటి పనులు చివరి దశలో ఉన్నా యి. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు డ్రా నిర్వహించారు. తొలి విడతలో భాగంగా 11,700 మంది లబ్ధిదారులను ఎంపికచేశారు.

ఈ మేరకు శనివారం గ్రేటర్‌ పరిధిలో తొమ్మిది చోట్ల వేదికలను ఏర్పాటు చేశారు. పేదలకు ఇళ్ల కేటాయింపులో గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న ఇంటి విస్తీర్ణం 560 చదరపు అడుగుల ప్లింత్‌ ఏరియాగా ఉంది. ప్రభుత్వపరంగా ఒక్కో గృహ నిర్మాణానికి వెచ్చించిన వ్యయం రూ.7.90 లక్షలు. అదే విధంగా ..మౌలిక వసతుల కల్పనకు వెచ్చించిన వ్యయం రూ.75 వేలుగా ఉంది. ఒక్కో డబుల్‌ బెడ్రూం ఇంటిపై ప్రభుత్వం వెచ్చించిన వ్యయం రూ.8.65 లక్షలు. అదే సమయంలో లబ్దిదారుడి వాటా..రుణ భారం లేకుండా ఇళ్ల కేటాయింపు జరుగుతోంది.

అనుకూలంగా సర్వే రిపోర్ట్స్
గతంలో కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చిన వాంబే గృహాలు, రాజీవ్‌ గృహకల్ప కంటే మెరుగైన వసతులు..ఎటువంటి భారం లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల కేటాయింపు ఆలస్యం అవుతోంది. దీని పైన ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. అయితే, గతంలో అమలు చేసిన ఇళ్ల స్కీంల కంటే మెరుగైన పద్దతిలో తాజాగా ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేస్తోంది.

ఇంటి కల నిజం చేసుకుంటున్న పేదల్లో సంతోషం కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్షల రూపాయల విలువైన డబుల్‌బెడ్రూం ఇండ్లను ఉచితంగా అందిస్తోంది. దీంతో, ఎన్నికల సమయంలో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటుగా.. సంక్షేమం తో మెజార్టీ ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ వైపే అండగా నిలుస్తుందని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+