Huzurabad: హుజురాబాద్‍లో కౌశిక్ రెడ్డి గెలుపుతో తప్పిన శవయాత్ర..!
బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ లో ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ఎన్నికల కౌశిక్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డారు. తనకు కూతురుతో కూడా ప్రచారం చేయించారు. చివరికి కౌశిక్ రెడ్డి గెలిపించకపోతే తన కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుందని హెచ్చరించారు." మీరు గెలిపిస్తే జైత్రయాత్రగా వస్తా లేకుంటే శవయాత్ర జరుగుతుందని" వ్యాఖ్యానించారు.
దీంతో హుజురాబాద్ ప్రజలు భయపడిపోయి జాలి పడి ఓటు వేసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈటలకు స్థానికంగా మంచి పేరు ఉన్నప్పటికీ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో జనం బీఆర్ఎస్ వైపు మొగ్గాల్సి వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కరీంనగర్ లో బండి సంజయ్ గంగుల కమలాకర్ చేతిలో 326 తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ తెలంగాణలో బీజేపీ బలపడింది.

ఈ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. గోషామహల్, నిర్మల్, కామారెడ్డి, ముథోల్, ఆర్మూర్, ఆదిలాబాద్, సిర్పూర్ లో విజయం సాధించింది. 2018 ఒక్క సీటు గెలిచిన బీజేపీ ఇప్పుడు 8 సీట్లు గెలిచింది. దుబ్బాకలో రఘునందన్ రావు ఓటమి పాలయ్యారు. బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు పోటీ చేయగా.. ముగ్గురు ఓడిపోయారు.












Click it and Unblock the Notifications