విజ్ఞానఖని: కేటీఆర్‌పై పరుచూరి ప్రశంసలు, ‘ఫిబ్రవరిలో ఇవాంకతో భేటీ’

హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్-2017)లో తన అద్భుత ప్రసంగంతోపాటు సమన్వయకర్తగా వ్యవహరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలంగాణ మంత్రి కేటీ రామారావుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

జీఈఎస్ వేదికపై ఆయన ప్రసంగం మంత్రముగ్ధుల్ని చేసిందని పలువురు ప్రముఖులతోపాటు నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ట్విట్టర్ వేదిక మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

Recommended Video

    GES 2017: Ivanka Trump

    విజ్ఞానఖని అంటూ పరుచూరి

    ‘కేటీఆర్ గారు ఇన్నాళ్లు రాజకీయ పోరాట యోధుడిగా, యువ నాయకునిగా తెలిసిన మీరు.. నిన్న ప్రపంచ వ్యాపార సదస్సు(జీఈఎస్)లో విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు. అభినందనలండి! భాషణం అనితరసాధ్యం' అని పరుచూరి తన ట్విట్టర్ ఖాతాలో కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు.

    ధన్యవాదాలంటూ కేటీఆర్

    పరుచూరి ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ‘ధన్యవాదాలు సార్' అని పరుచూరికి కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్. కాగా, కేటీఆర్ ప్రపం పారిశ్రామికవేత్తల సదస్సులో సమన్వయకర్తగా వ్యవహరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపించారు. కాగా, మెట్రో ప్రారంభోత్సవంలోనూ కేటీఆర్‌కు ప్రధాని మోడీ అమితమైన ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.

     ఫిబ్రవరిలో ఇవాంకాతో కేటీఆర్ భేటీ?

    ఫిబ్రవరిలో ఇవాంకాతో కేటీఆర్ భేటీ?

    రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు 2018 ఫిబ్రవరిలో అమెరికాలో ఇవాంకతో భేటీ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ఘనంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించడం పట్ల ఇవాంక సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన ప్రసంగంలోనూ దీనినే ఆమె పేర్కొన్నారు. జీఈఎస్‌లో భేటీ సందర్భంగా మంత్రి కేటీఆర్.. తాను ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించే అవకాశం ఉందని ఇవాంకతో ప్రస్తావించినట్టు తెలుస్తుస్తోంది. అయితే అమెరికాకు వచ్చినట్టయితే తనను తప్పకుండా కలువాలని ఇవాంక సూచించిన విషయం తెలిసిందే.

     ప్రతిష్ట పెరిగింది..

    ప్రతిష్ట పెరిగింది..

    దక్షిణాసియాలో తొలిసారి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)ను నిర్వహించడం వల్ల హైదరాబాద్ ప్రతిష్ఠ ఇనుమడించిందని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అభిప్రాయపడ్డారు. జీఈ సదస్సు దక్షిణాసియాలో మొట్టమొదటిసారి జరుగడం.. అదీ హైదరాబాద్ ఈ సదస్సుకు ఆతి థ్యం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. సదస్సు నిర్వహణకోసం నీతిఆయోగ్ నిర్వహించిన పోటీలో క్రియాశీలకంగా పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఈ అపూర్వ అవకాశాన్ని దక్కించుకున్నదని గుర్తు చేశారు. దాదాపు 142 దేశాల నుంచి 1,500 నుంచి 2,000 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకుర పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులు జీఈఎస్‌లో పాల్గొన్నారని మంత్రి కేటీఆర్ వివరించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+