పవన్ Vs రేవంత్ X కేటీఆర్, చంద్రబాబు సేఫ్ గేమ్ - సెటిలర్లు ఎటు..!!
తెలంగాణలో కొత్త రాజకీయం మొదలైంది. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. టీడీపీ, వైఎస్సార్టీపీ పోటీ నుంచి తప్పుకున్నాయి. చంద్రబాబు కేంద్రంగా సెటిలర్ల ఓట్ బ్యాంక్ పైన చర్చ సాగుతోంది. బీజేపీతో జత కట్టిన పవన్ ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. టీడీపీ మద్దతుదారులు కాంగ్రెస్ కు మద్దతిస్తారనే ప్రచారం సాగుతోంది. మరి..పవన్ వాళ్లను తన వైపు తిప్పుకుంటారా. ఈ మొత్తం గేమ్ లో చంద్రబాబు ప్రభావం ఎంత. బీఆర్ఎస్ ఏం చేయబోతోంది.
సెటిలర్ల ఓట్లు ఎవరికి
తెలంగాణలో ఇప్పుడు సెటిలర్ల ఓట్లు ఎవరికి దక్కుతాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోనూ కొన్ని నియోజకవర్గాల్లో సెటిలర్ల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా హైదరాబాద్ పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో సెటిలర్లు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు.

కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్ నియోజకవర్గాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ఏపీ నుంచి వచ్చిన వారు ఇక్కడ ఎక్కువగా ఉండటంతో వీరిని ఆకట్టుకోవటానికి కాంగ్రెస్ ,బీజేపీ, బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ పోటీలో లేకపోవటం, తొలి సారి జనసేన ఇక్కడ ఎన్నికల బరిలో నిలవటంతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
మారుతున్న లెక్కలు
చంద్రబాబు అరెస్ట్ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో పార్టీలు అలర్ట్ అయ్యాయి. టీడీపీ మద్దతు దారులు కాంగ్రెస్ కు అండగా నిలుస్తారనే ప్రచారం నడుమ చంద్రబాబు - పవన్ కొత్త స్కెచ్ వేసారు. ఏపీలో అధికారం లక్ష్యంగా పావులు కదుపుతున్న ఈ ఇద్దరు బీజేపీ తమకు దూరం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగా ఢిల్లీలో జరిగిన నిర్ణయం మేరకు టీడీపీ పోటీ నుంచి తప్పుకోగా..బీజేపీకి మిత్రపక్షంగా జనసేన బరిలోకి దిగింది. వీరి లక్ష్యం అర్దం చేసుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఎదురుదాడి ప్రారంభించారు. కేసీఆర్ వ్యతిరేకులంతా ఏకం అవుతున్నారని ప్రచారం మొదలు పెట్టారు. జనసేనకు గ్రేటర్ లో రెండు స్థానాలు..జిల్లాల్లో ఏడు స్థానాలు ఇచ్చేందుకు బీజేపీ సిద్దమైంది.
చంద్రబాబు లెక్కే వేరు
ఇప్పుడు బీజేపీతో జత కలిసి సెటిలర్ల ఓట్ల పైన గురి పెట్టిన పవన్ టీపీసీసీ చీఫ్ రేవంత్ తో పాటుగా బీఆర్ఎస్ కు టార్గెట్ కానున్నారు. అదే సమయంలో పవన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ లో ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది. పవన్ ప్రచారానికి రావటం ద్వారా సెటిలర్ల ఓట్లు బీజేపీ, కాంగ్రెస్‌లకు చీలి..బీఆర్‌ఎస్‌కు 20 శాతం ఓట్లు, బీజేపీ, కాంగ్రెస్‌కు 50 శాతం, బీఆర్ఎస్ కు 30 శాతం ఓట్లు పడే అవకాశం ఉన్నట్లు విశ్లేషణలు మొదలయ్యాయి.
టీడీపీ మద్దతు దారులు ఏపీలో తమ పార్టీకి అండగా నిలిచిన పవన్ ను సపోర్ట్ చేస్తారా..లేక రేవంత్ కే ఓటు వేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఇద్దరిలో సెటిలర్లు ఎవరికి మద్దతు ఇచ్చినా..ఇద్దరి ద్వారా ఎటువంటి ప్రయోజనం కలిగినా తాను సేఫ్ జోన్ లో ఉండేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. సేఫ్ గేమ్ మొదలు పెట్టారు. అయితే, ఈ పొత్తులు...లెక్కలు ఏపీలో టీడీపీ - జనసేనకు కలిసి వస్తాయా..మొత్తానికే బూమ్ రాంగ్ చేస్తాయా అనేది ఈ ఎన్నికల తరువాతనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్











Click it and Unblock the Notifications