హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జల్సాలకు మరిగి చోరీలు చేసిన బిటెక్ విద్యార్థి (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జల్సాలకు మరిగి చోరీలకు పాల్పడుతున్న బిటెక్ విద్యార్థిని పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.10 లక్షలు విలువ చేసే 45 తులాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

శుక్రవారం ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసిపి వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు. మధురానగర్‌లో నివాసం ఉండే రాహుల్ బీటెక్ విద్యార్ధిని పోలీసులు అరెస్టు చేశారు.

తల్లిదండ్రులిద్దరూ టైలరింగ్ చేస్తూ కొడుకును ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ రాహుల్ జల్సాలకు కావాల్సిన డబ్బును సమకూర్చుకునేందుకు దొంగతనాలకు సిద్దమయ్యాడు. గత సంవత్సరం డిసెంబర్ 18న సమీపంలోని ఇంటిని టార్గెట్ చేసుకొని తాళాలు ఎక్కడ పెడుతున్నారో గమనించి బయటకు వెళ్లగానే 30 తులాలను చోరీ చేశాడు.

అదే ఇంట్లో చోరీ

అదే ఇంట్లో చోరీ

నిరుడు డిసెంబర్ 18వ తేదీన చోరీ చేసిన ఇంటినే ఈసారి కూడా చాలా కాలం గడవడంతో తిరిగి అదే ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

చోరీ గురించి బాదితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేస్తున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు సమీపంలో నివసిస్తున్నవారి పనేనని అనుమానించారు.

అనుమానాస్పదంగా తిరుతుండడంతో

అనుమానాస్పదంగా తిరుతుండడంతో

వెంటనే ఆ ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతున్న రాహుల్‌ను అదుపులోనికి తీసుకొని విచారించగా దొంగతనాలను వివరించాడు.

బంగారం స్వాధీనం

బంగారం స్వాధీనం

రాహుల్ వద్ద నుంచి పోలీసులు రూ.10 లక్షలు విలువ చేసే 45 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

English summary
A btyech student Rahul has been arrested in theft case in hyderabas of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X