అవేవీ నాకు తెలియదు: ఎసిబికి సండ్ర జవాబు, జడ్జీ ఆరా (పిక్చర్స్)

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో విచారణ నిమిత్తం రెండు రోజులపాటు కస్టడీలోకి తీసుకున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్యపై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఈ కేసులో సండ్రను తెలంగాణ ఎసిబి ఏ-5 నిందితునిగా చేర్చిన విషయం తెలిసిందే.

సెబాస్టియన్‌తో జరిగిన ఫోన్‌ సంభాషణలు, స్టీఫెన్‌కు ఇచ్చేందుకు తెచ్చిన 50లక్షలు, తర్వాత ఇచ్చేందుకు ఒప్పం దం కుదుర్చుకున్న రూ.4.5 కోట్లపైనే ప్రశ్నలు సంధించింది. ఈ కేసులో మిగతా నిందితుల విచారణ సందర్భంగా డబ్బుల విషయం మీకు తెలుసు అని చెప్పారని ఎసిబి అధికారులు సండ్రను ప్రశ్నించారని సమాచారం.

అవేవీ తనకు తెలియదని ఆయన బదులిచ్చినట్లు తెలిసింది. కోర్టు అనుమతితో గురు, శుక్రవారం మొత్తం 9 గంటలపాటు సండ్రను విచారించా రు. తొలిరోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు విచారించారు. తర్వాత వైద్యపరీక్షలు నిర్వహించి రాత్రి బషీర్‌బాగ్‌లోని సిట్‌ కార్యాలయానికి తరలించారు.

ఇలా ప్రశ్నించారు...

ఇలా ప్రశ్నించారు...

శుక్రవారం ఉదయం 6.30 గంటలకే సండ్రను ఏసీబీ ఆఫీస్‌కి తీసుకెళ్లి, ఉదయం 11 గంటల నుంచి భోజన విరామం వరకు ప్రశ్నించారు. తొలిరోజు అడిగిన ప్రశ్నలనే కొద్దిగా మార్చి అడిగి సమాధానాలు రాబట్టే యత్నించగా వాటికి బదులిచ్చేందుకు సండ్ర నిరాకరించినట్టు తెలిసింది.

సమస్యలు వచ్చాయా...

సమస్యలు వచ్చాయా...

ఎసిబి కస్టడీలో ఏవైనా సమస్యలు వచ్చాయా అని న్యాయమూర్తి అడిగారు. అయితే సమస్యలేవీ రాలేదని, విచారణకు పూర్తిగా సహకరించానని సండ్ర వెంకట వీరయ్య చెప్పారు.

మీడియాతో సండ్ర ఇలా..

మీడియాతో సండ్ర ఇలా..

ఎసిబి విచారణకు పూర్తిగా సహకరించానని ఎసిబి కోర్టుకు హాజరైన సందర్భంగా సండ్ర మీడియాతో చెప్పారు. సండ్రను ఎసిబి అధికారులు కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో ప్రశ్నించారని ఆయన తరఫు న్యాయవాది సుధీర్ కుమార్ చెప్పారు. విచారణ నివేదికను ఇంకా ఎసిబి అధికారులు కోర్టుకు సమర్పించలేదని చెప్పారు.

చర్లపల్లి జైలుకు తరలింపు

చర్లపల్లి జైలుకు తరలింపు

శుక్రవారం మధాహ్నం భోజనం తర్వాత న్యాయమూర్తి లక్ష్మీపతి ఆదేశాల మేరకు ఈ నెల 21 వరకూ రిమాండ్‌ కోసం చర్లపల్లి జైలుకు తరలించారు. సండ్రకు కోర్టు ఈ నెల 21వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+