Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్లీజ్ ఐదు నెలలు ఓపిక పట్టండి.!బీజేపీ అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇండ్లు ఇస్తామన్న బండి సంజయ్.!

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎంతమంది దరఖాస్తు చేశారు? ఎంతమందికి ఇండ్లు కేటాయించారో వివరాలు ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 2.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే, చంద్రశేఖర్ రావు ప్రభుత్వం అన్నీ నిర్మించినట్లుగా లెక్కలు చూపిందని, అధికారులను నిలదీస్తే ఏడు వేల మందికే ఇండ్లను కేటాయించినట్లు తేల్చారన్నారు. పేదలకు ఇండ్లు దక్కకుండా వారి నోట్లో మట్టి కొడుతున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు.

 bandi

సీఎం కేసీఆర్ కు వివరాలిచ్చే దమ్ముందా : పేదలకు ఇండ్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం కోరితే పెద్ద ఎత్తున ఇండ్లను మంజూరు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్. డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో చంద్రశేఖర్ రావు సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గురువారం కూకట్ పల్లి మూసాపేటలో బీజేపీ నేతలు చేస్తున్న ''ఆత్మగౌరవ దీక్ష''కు బండి సంజయ్ సంఘీభావం తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్రం పేదల కోసం మంజూరు చేస్తున్న ఇండ్లను పేదలకు అందించాలని, డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్దిదారులకు కేటాయించాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

కేంద్రం నుండి పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణానికి నిధులు తెస్తా : తెలంగాణ ప్రజలు నిలువ నీడ లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎక్కడ ఖాళీ స్థలముంటే అక్కడ గుడిసె వేసుకుని ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అల్లాడుతున్నరన్నారు. కూకట్ పల్లికి వచ్చి ఎంతోమంది ఇక్కడే ఏండ్ల తరబడి అద్దె ఇండ్లలో ఉంటూ కిరాయిలు కట్టలేకపోతున్నరని, ఇట్లాంటి పేదల బాధలను తీర్చేందుకే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లను నిర్మించింది. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇండ్లు కావాలని అడిగితే లక్షన్నర ఇండ్లు కావాలని చంద్రశేఖర్ రావు చెబితే, మరో లక్ష ఇండ్లు అదనంగా మంజూరు చేశారని బండి సంజయ్ కుమార్ గుర్తు చేసారు.

 bandi

కూలిపోయే దశలో డబుల్ బెడ్రూం ఇండ్లు : కానీ పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తానని ఊరించి చంద్రవేఖర్ రావు మోసం చేసాడని, కేంద్రం మంజూరు చేసిన ఇండ్లలో తెలంగాణ ప్రజలకు ఎన్ని ఇండ్లు కట్టించారని నిలదీస్తే, 7 వేల ఇండ్లు మాత్రమే పూర్తి చేశారని అధికారులు తేల్చారని, రెండున్నర లక్షల ఇండ్లు మంజూరు చేస్తే 7 వేలు ఇండ్లు మాత్రమే కట్టి పేదల నోట్లో మట్టి కొడుతున్నడని చంద్రశేఖర్ రావుపై మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో పెద్ద పెద్ద గ్రాఫిక్స్ తో వీడియో తీసి కేంద్రానికి చూపించిన చంద్రశేఖర్ రావు ప్రభుత్వం పేదలకు మాత్రం ఒక్క ఇల్లు కూడా మంజూరూ చేయలేదన్నారు.

 bandi

ఉచితంగా విద్య, వైద్యం అందిస్తాం : డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారు? ఎంతమందికి ఇండ్లు కేటాయించారు? ఎంతమంది ఆ ఇండ్లలో నివాసముంటున్నారో దమ్ముంటే సీఎం సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. అక్కడక్కడా కడుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం నాసిరకంగా ఉన్నాయని, ఇండ్లలోకి వెళ్లకముందే కూలిపోయే దశలో ఉన్నయన్నారు బండి సంజయ్.

వేల కోట్లు దోచుకున్నసీఎంకు పేదలకు రెండు గదుల ఇండ్లు ఇవ్వడానికి చేతులు రావడం లేదా అని ప్రశ్నించారు. పేదల పక్షాన బీజేపీ ఉద్యమిస్తోందని, ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నరని, అయినా సరే బెదిరేది లేదు. పేదలకు ఇండ్లు ఇచ్చే వరకు పోరాడతామన్నారు బండి సంజయ్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+