మీడియా నా మాటలను వక్రీకరించింది: పోచారం
నిజామాబాద్: రైతుల ఆత్మహత్యల విషయంలో తాను చేసిన వ్యాఖ్యను కొన్ని పత్రికలు వక్రీకరించాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. రైతుల ఆత్మహత్యలు వాస్తవమేనని తాను చెప్పానని, అయితే ఆ మాటలను కొన్ని పత్రికలు వక్రీకరించాయని ఆయన శనివారం నిజామాబాద్‌లో అన్నారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన చెప్పారు. రైతు ఆత్మహత్యలపై తాను చేసిన వ్యాఖ్యలపై కొన్ని పత్రికల తీరును ఆయన ఖండించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపల ఆ కుటుంబాలను ఆదుకుంటామని ఆయన చెప్పారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, తాను కూడా రైతు బిడ్డలమేనని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు తన సొంత రాష్ట్రంలో రైతుల రుణమాఫీ చేయలేదని ఆయన విమర్శించారు. కానీ కెసిఆర్ మాత్రం తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలూ తీసుకున్నారని ఆయన చెప్పారు.
తాను ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రైతుల ఆత్మహత్యలపై తాను ఏ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయలేదని ఆయన అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేశాయని ఆయన అన్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications