శ్మశానంలో వ్యభిచారం దందా.. వాట్ అన్ ఐడియా మేడం !
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు రోజురోజుకీ మరింత రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త దారులను వెతుక్కుంటూ తమ దందాని కొనసాగిస్తున్నారు. అయితే వ్యభిచారం నిర్వహించేందుకు ఓ మహిళ పన్నిన పన్నాగం సభ్యసమాజాన్ని సైతం షాక్ కి గురి చేస్తోంది. ఏకంగా శ్మశాన వాటికను తమ అడ్డాగా మార్చుకొని గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం సాగిస్తోంది.
ఈ వ్యవహారాన్ని పసిగట్టిన పోలీసులు అకస్మాత్తుగా దాడి చేసి వారి బండారాన్ని బయటపెట్టారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నడిబొడ్డులోని బేగంపేట ఏరియాలో చోటు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని బేగంపేటలో శ్మశాన వాటికను వ్యభిచారం నిర్వహించేందు అడ్డాగా మార్చింది ఓ మహిళ. శ్యామ్ లాల్ బిల్డింగ్స్ సమీపంలో ఉన్న ఈ శ్మశాన వాటికలోని ఒక గదిని వ్యభిచార గృహంగా మార్చి, గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. ఈ అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న మహిళ పేరు మాధవి. ఆమె యువతులను తీసుకువచ్చి, విటులను ఆహ్వానించి ఈ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న బేగంపేట పోలీసులు శ్మశాన వాటికపై దాడి చేశారు. ఈ దాడిలో మాధవితో పాటు ఒక యువతిని.. విటుడిగా వచ్చిన ఒక సివిల్ కాంట్రాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అనైతిక కార్యకలాపాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటన సమాజంలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. శ్మశాన వాటికను ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించడం చాలా విచారకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రకమైన నేరాలను అరికట్టడానికి పోలీసులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి ప్రదేశాలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారకుండా నిఘా పెంచాల్సిన అవసరం ఉందని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. మన దేశంలో వ్యభిచారం నేరం కానప్పటికీ, వ్యభిచార గృహాలను నిర్వహించడం.. ఒక సమూహంగా వ్యభిచారం చేయడం, వ్యభిచారం కోసం ఒకరిని ప్రేరేపించడం వంటివి చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది.












Click it and Unblock the Notifications