Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పైకి మసాజ్ సెంటర్! లోపల మాత్రం వ్యభిచార దందా, యువతులతోపాటు 8మంది అరెస్ట్

హైదరాబాద్: మసాజ్‌ సెంటర్ పేరుతో వ్యభిచార దందా కొనసాగిస్తున్న ముఠా ఆటను కట్టించారు పోలీసులు. నిర్వాహకుడితోపాటు ఎనిమిదిమంది నిందితులను అదుపులోకి తీసుకుని నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

చిలకలగూడ ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి, డీఐ నర్సింహారాజు తెలిపిన వివరాల ప్రకారం... బెంగళూర్‌కు చెందిన సమీర్‌ అగర్వాల్‌(40) మెట్టుగూడలోని గాయత్రి ప్లాజా మూడో అంతస్తులోని 302 ప్లాట్‌లో స్టార్‌స్పా పేరుతో ఆరునెలల కిందట మసాజ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

 Police raid massage parlours over charges of prostitution, eight arrested

దీనిద్వారా ఆశించిన ఆదాయం రాకపోవడంతో.. 'లోకోంటో' అశ్లీల వెబ్‌సైట్‌లో ఆకర్షించే యువతుల ఫోటోలతో పాటు ఫోన్‌ నంబరును ఉంచారు. అంతేగాక, కాల్‌ చేసే వారి పూర్తి వివరాలు సేకరించి స్పా సెంటర్‌కు రప్పించి వ్యభిచారం నిర్వహించడం ప్రారంభించారు.

కొంతకాలంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఓ కానిస్టేబుల్‌ను విటుడిగా పంపించి వివరాలను సేకరించారు. శనివారం రాత్రి 6గంటలకు మసాజ్‌ సెంటర్‌పై దాడిచేశారు. నిర్వాహకుడు సమీర్‌ అగర్వాల్‌తో పాటు అక్కడ పనిచేస్తున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరిని, ముగ్గురు విటులను, ఇద్దరు యువతులను కటకటాల వెనక్కినెట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+