Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆయనకు రాగద్వేషాల కన్నా రాజకీయమే ఎక్కువ.!కేసీఆర్ పై పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు.!

హైదరాబాద్ : తెలంగాణలో వేడెక్కిన రాజకీయాన్ని కొంతమంది నాయకులు మరింత వేడెక్కిస్తున్నారు. గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపైన సొంత పార్టీ నేతలు ఇప్పటివరకూ బహిర్గంగా విమర్శించిన దాఖలాలు లేవు. పార్టీ నాయకులను గానీ, సహచర మంత్రులను గానీ సీఎం మందలించినప్పటికీ ఏ నాయకుడు కూడా ఎదురుచెప్పే ప్రసక్తి ఇప్పటివరకూ గులాబీ పార్టీలో కనిపించ లేదు. కానీ ఇటీవల పార్టీనుంచి బహిష్కరించిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు మాత్రం సీఎం చంద్రశేఖర్ రావు ను విమర్శిస్తున్నారు. పొంగులేటి ఓ అడుగు మందుకేసీ చంద్రశేఖర్ రావుపై ఘాటు వ్యాఖ్యలు కూడా సంధిస్తున్నారు.

దూకుడు పెంచిన పొంగులేటి.. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు..
పార్టీ నుండి బహిష్కరణకు గురైనప్పటి నుండి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తన సొంత నియోజకవర్గమైన ఖమ్మంలో తీవ్రంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రశేఖర్ రావు పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పార్టీలో ఇంతవరకూ ఎవ్వరూ చేయని సాహసాన్ని పొంగులేటి చేసి చూపిస్తున్నారు. ఎప్పుడు వచ్చాం అనేది కాదు.. బుల్లెట్ తప్పకుండా దిగుతుంది.. ఆ బుల్లెట్ కూడా ఖచ్చితంగా గుచ్చుకుంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సీఎం చంద్రశేఖర్ రావును పరోక్షంగా శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు. రాబోవు రోజుల్లో తన నిర్ణయం బుల్లెట్ లాగా మారబోతుందని గులాబీ పార్టీపై సెటైర్ వేశారు.

Ponguletis harsh comments on KCR.

రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదు.. పొంగులేటి నోటి వెంట పోకిరీ డైలాగులు
అంతే కాకుండా 30 సంవత్సరాలు ఇండ్రస్ట్రీ అని చెప్పుకోవడం కాదని, ప్రజలకు ఎం చేశారో చెప్పాలని, ఎప్పుడు వచ్చాం అనేది కాదని, ఎన్ని మంచి పనులు చేశాం అనేది కావాలి అంటూ తెలంగాణ సీఎంపై విరుచుకుపడ్డారు. రాబోయే రోజుల్లో నా విజయం అశ్వారావుపేట నుండే ప్రారంభమవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి. తెలంగాణా రాష్ట్రం వస్తే ప్రజల బ్రతుకులు బాగుపడతాయని కలలు కన్నారని, కానీ వారి కలలు కల్లలుగానే మిగిలిపోయాయని, ఇవి నగ్న సత్యాలన్నారు పొంగులేటి. మాటల గారిడితో రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖర్ రావు మూడోసారి కూడా సీఎం అవ్వటానికి ప్రణాళికలు రచిస్తున్నారని పొంగులేటి అన్నారు.

Ponguletis harsh comments on KCR.

తండ్రిలాంటి వాడు పట్టించుకోలేదు.. అందుకే తిరుగుబావుటా ఎగరేసానన్న పొంగులేటి..
అంతే కాకుండా మరో ఆరు నెలల్లో ఎన్నికలో రాబోతున్నాయని. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రిని గద్దె దించాలని పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తిగా ఉండటమే కాదు పార్టీపై విమర్శనాస్త్రాలు కూడా సంధించారు. దీంతో పార్టీనుంచి ఆయనను భహిరిస్తూ చంద్రశేఖర్ రావు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న పొంగులేటి ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదు. బీజేపీలో లేదా కాంగ్రెస్ లో చేరతారని, వైఎస్సార్ టీపీలో చేరతారనే వార్తలు తెరమీదకు వస్తున్నాయి. చంద్రశేఖర్ రావుకు రాగద్వేషాల కన్నా రాజకీయమే ముఖ్యమని, అందుకే తమలాంటి నేతలు అకారణంగా బలవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+