నీలిచిత్రాలు చూస్తూ ..నెలరోజులుగా 6వతరగతి విధ్యార్థిపై తోటి విధ్యార్థుల లైంగిక దాడి
సెల్ ఫోన్లలో నీలిచిత్రాలు చూస్తూ 6వ, తరగతి విధ్యార్థిపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఆరుగురు 9వ,తరగతి విధ్యార్థులను పాఠశాల నుండి టిసిలు ఇచ్చి పంపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బండారుపల్లి గురుకుల ప
ములుగు :టెక్నాలజీతో లాభాలున్నాయి. నష్టాలు కూడ ఉన్నాయి. అయితే దాన్ని ఏ రకంగా ఉపయోగించుకొంటే అవే రకమైన ఫలితాలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. నిబంధలకు విరుద్దంగా రెసిడెన్షియల్ స్కూల్ లో సెల్ ఫోన్ ను వాడడమే కాకుండా ఓ విధ్యార్థి పై లైంగిక దాడికి పాల్పడ్డారు.
విద్యాబుద్దులు నేర్చుకొని సమాజానికి ఉపయోగపడాల్సిన విధ్యార్థులపై నీలి చిత్రాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. నెలరోజులపాటు తమ కంటే వయస్సులో చిన్న వాడైన విధ్యార్థిపై లైంగికదాడికి పాల్పడ్డారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు మండలం బండారుపల్లిలోని బాలుర గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకొంది.ఈ గురుకుల పాఠశాలలో 9వ, తరగతి చదివే విధ్యార్థులు 6వ, తరగతి విధ్యార్థిపై నెలరోజులుగా లైంగికదాడికిపాల్పడ్డారు. ఎట్టకేలకు ఈ విషయం వెలుగుచూడడంతో వారికి టిసి లు ఇచ్చి పంపారు.

సెల్ ఫోన్ల ప్రభావంతో..
ఈ గురుకుల పాఠశాలలోకి సెల్ ఫోన్లను తీసుకురావడం నిషేధం. కాని, ఈ గురకుల పాఠశాలలోకి రెండు సెల్ ఫోన్లు వచ్చాయి. ఈ రెండు ఫోన్లు కూడ అత్యాధునిక సెల్ ఫోన్లు.ఇంటర్నెట్ సహయంతో ఈ ఫోన్లనలో ప్రతి రోజు రాత్రి 9వ, తరగతి విధ్యార్థులు రాత్రి పూట నీలిచిత్రాలు చూసేవారు.ప్రతిరోజూ నీలిచిత్రాలు చూడడం వల్ల ఆ విధ్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
ప్రతిరోజూ సాయంత్రం పూట భోజనం ముగించిన తర్వాత డార్మెటరీ రూమ్ లో తరగతలు వారీగా విధ్యార్థులు నిద్రిస్తారు. కానీ, 6వ, తరగతి చదువుతున్న విధ్యార్థిపై 9వ, తరగతి చదివే ఆరుగురు విధ్యార్థులు లైంగిక దాడులకు పాల్పడ్డారు.నీలిచిత్రాల్లో చేసినట్టుగా చేయాలని ఆ విధ్యార్థిపై ఆరుగురు ఒత్తిడి తెచ్చారు. ఈ ఘటనతో 6వ, తరగతి విధ్యార్థిలో మార్పులు వచ్చాయి. చురుకుగా ఉండే విద్యార్థి చాల ముభావంగా మారిపోయాడు.
దీపావళి సెలవుల తర్వాత గురుకుల పాఠశాలకు వచ్చిన విధ్యార్థి ప్రవర్థనలో మరింత మార్పు వచ్చింది. విషయాన్ని గుర్తించిన ప్రిన్సిఫాల్ ఆరా తీశాడు. దీంతో ఆ విధ్యార్థి అసలు విషయాన్ని బయటపెట్టాడు. వెంటనే విచారణ జరిపి వాస్తవాలను తెలుసుకొన్నారు ప్రిన్సిపాల్. ఆరవ తరగతి విధ్యార్థిపై లైంగిక దాడికి పాల్పడిన ఆరుగురు విధ్యార్థులకు టిసిలు ఇచ్చి పంపారు ప్రిన్సిపాల్.మరో ఇద్దరు విధ్యార్థులు టిసిలు తీసుకొని వెళ్ళిపోయారు.












Click it and Unblock the Notifications