హైదరాబాదులో రోహింగ్యాలు-వార్నింగ్ ఇచ్చిన VHP..!!
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై సాగుతున్న అమానుష దాడులు, దేవాలయాల కూల్చివేత మరియు హత్యాకాండను నిరసిస్తూ భాగ్యనగరంలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. విశ్వహిందూ పరిషత్ (VHP), హిందూ వాహిని ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ కార్పొరేటర్లతో కలిసి కొత్తపేట చౌరస్తాలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
నినాదాలతో హోరెత్తిన కొత్తపేట చౌరస్తా
బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై సాగుతున్న మారణహోమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిహాదీ శక్తులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ, వారి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా చౌరస్తాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమాయక హిందువుల రక్తం చిందిస్తున్న వారిపై అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి వెంటనే జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో అక్రమ వలస దారుల కలకలం:VHP ఆందోళన
ఈ నిరసనలో పాల్గొన్న VHP నాయకులు తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని కీలకమైన కేంద్ర రక్షణ రంగ సంస్థలు ఉన్న పరిసర ప్రాంతాల్లో రోహింగ్యాలు అక్రమంగా నివాసం ఉంటున్నారని వారు ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత మరియు నిఘా వర్గాల విఫలమవడం వల్లే పెద్ద సంఖ్యలో రోహింగ్యాలు నగరంలోకి చొరబడుతున్నారని మండిపడ్డారు.రక్షణ సంస్థల సమీపంలో అక్రమ వలసదారులు శాశ్వత నివాసాలు ఏర్పరుచుకోవడం దేశ భద్రతకు పెద్ద ముప్పు అని వారు హెచ్చరించారు.వెంటనే అక్రమ వలసదారులను గుర్తించి, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్నమారణహోమాన్ని ఖండిస్తూ కొత్తపేట చౌరస్తాలో బంగ్లాదేశ్ జిహాదీల దిష్టిబొమ్మ దహనం..!!#BangladeshViolence #ProtectHindus#MinorityRights #StopReligiousPersecution #HumanRightsJustice #NewsUpdate #OIupdates #Oneindiatelugu pic.twitter.com/aZkLjwyP29
— oneindiatelugu (@oneindiatelugu) December 23, 2025
ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువుల ప్రాణాలకు రక్షణ కల్పించే వరకు తమ పోరాటం ఆగేది లేదని వారు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications