రీ ఓపెన్: ముగ్గురు ఐఏఎస్, ఓ ఐపీఎస్‌లను వెంటాడుతున్న రహేజా కేసు

హైదరాబాద్: రహేజా-ఏపీఐఐసీ జాయింట్ వెంచర్ కేసు క్లోజ్ అయిన ఏడాది తర్వాత తిరిగి రీ ఓపెన్ అవుతోంది. రహేజా వ్యవహారంలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని, దానిని విచారించాలంటూ ఏసీబీ న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు బుధవారం అనుమతించింది. ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరించి దానిని సరిదిద్దినంత మాత్రాన కేసును మూసివేయాలని ఏసీబీ సిఫారసు చేయడం సరికాదని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ వాదనతో ఏసీబీ కోర్టు జడ్జి అంగీకరించారు.

ఈ నేపథ్యంలో ముగ్గురు ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారికి 2016 ఫిబ్రవరి 12వ తేదీన విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం తాఖీదులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారులు బిపి ఆచార్య, ఎల్వీ సుబ్రహ్మణ్యం, కె రత్నప్రభ, ఐపీఎస్ అధికారి ఎం గోపీకృష్ణకు నోటీసులు జారీ అయ్యాయి.

Raheja case returns to haunt senior officers

రహేజాకు భూకేటాయింపుల నుంచి ఏపీఐఐసీ వాటాను 11నుంచి 0.55 శాతానికి తగ్గించడంలో అక్రమాలు జరిగాయని న్యాయవాది శ్రీరంగారావు ఏసీబీ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. కోర్టు ఆదేశం మేరకు నివేదిక సమర్పించిన ఏసీబీ.. ఏపీఐఐసీ వాటాను పునరుద్ధరించడంతో కేసును మూసివేయాలంటూ పేర్కొంది.

దీనిని వ్యతిరేకిస్తూ న్యాయవాది శ్రీరంగారావు ప్రొటెస్ట్ ‌(నిరసన) పిటిషన్‌ వేశారు. పిటిషనర్‌ తరఫున లాయర్ గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తూ... రహేజా ప్రాజెక్టులో ఏపీఐఐసీ వాటాను ఏపీఐఐసీ, రహేజాల సంయుక్త ప్రాజెక్టులో ఈక్విటీని పెంచగా అప్పట్లో రూ.2.09కోట్లు చెల్లించకపోవడంతో ఏపీఐఐసీ వాటా 11నుంచి 0.55శాతానికి తగ్గిందన్నారు.

తద్వారా ప్రభుత్వానికి రూ.600 కోట్ల నష్టం వాటిల్లుతుందని తెలిసి అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారన్నారు. ప్రభుత్వ ఆస్తులకు ట్రస్టీలుగా ఉండాల్సిన వారు ప్రయివేటుకు అనుకూలంగా వ్యహరించారన్నారు. ఈ వాదనలను విన్న కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+