తెలంగాణలో రాహుల్ పర్యటన : వరంగల్ లో సభ- 72 స్థానాల్లో గెలుపు మాదే: రేవంత్..!!
తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి సారి రాష్ట్రానికి రాహుల్ గాంధీ రానున్నారు. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం తెలంగాణలో పర్యటించాలని రాహుల్ ను కోరింది. పార్టీ పరంగా నిర్వహిస్తున్న దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో పాల్గొనేందుకు రాహుల్ అంగీకరిచినట్లుగా సమాచారం. అందులో భాగంగా.. చివరి సభ వరంగల్ లో నిర్వహించాలని టీపీసీసీ నేతలు నిర్ణయించారు. ప్రకటించారు. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్, సిఎల్పీ నేత బట్టి విక్రమార్క అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్ల సమావేశంలో దళిత గిరిజన దండోరా, పార్టీ పనితీరుపై చర్చించారు.
సెప్టెంబర్ 10 నుంచి 17 మద్య దండోరా సభ వరంగల్‌లో నిర్వహించాలని, దానికి రాహుల్ గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణలో కాంగ్రెస్ కచ్చితంగా 72 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, ఎవరు ఆపలేరని రేవంత్ స్పష్టం చేశారు. యూత్, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్సీ, ఎస్టీ విభాగాల నుంచి 119 ఇంఛార్జీలను నియమించుకోవాలని సూచించారు.

ఇంద్రవెల్లి, రావిర్యాల సభలను కార్యకర్తలు విజయం చేశారని, దాని వల్ల పార్టీ చాలా బలోపేతం అయ్యిందన్నారు. రంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల వేదికగా జరిగి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా మహాసభకు జనం భారీగా తరలివచ్చారు. ఏకధాటిగా వర్షం కురుస్తున్నప్పటికీ కార్యకర్తలు కదలకుండా అలాగే ఉండిపోయారు. ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో నిన్నటి వరకు నిస్తేజంగా ఉన్న ఆ పార్టీ కేడర్‌లో ఒక్కసారిగా నూతనోత్సాహం కనిపించింది. వర్షంలోనే రేవంత్‌రెడ్డి స్వీచ్ ఇవ్వడం.. ప్రముఖు ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. సభను సక్సెస్ చేయటం పైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సైతం అభినందించారు.
ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పొలిటిక్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఇందులో హుజూరాబాద్ ఉప ఎన్నికల అభ్యర్ది పైన చర్చిస్తున్నట్లుగా సమాచారం. టీఆర్ఎస్ నుంచి బీసీ అభ్యర్ది గెల్లె శ్రీను, బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ లేదా ఆయన సతీమణి పోటీ చేసే అవకాశం ఉండటంతో..కాంగ్రెస్ నుంచి ఎవరిని అభ్యర్ధిగా బరిలో దింపాలనే అంశం పైన చర్చ చేస్తున్నట్లుగా సమాచారం. అయితే, మాజీ మంత్రి కొండా సురేఖ పేరు పరిశీలనలో ఉన్నా.. అధికారికంగా టీపీసీసీ నుంచి ఏఐసీసీ కి సిఫార్సు వెళ్లాల్సి ఉంది. దీని పైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సమక్షంలో అభిప్రాయ సేకరణ చేసి ..తుది నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications