ఈ తేదీల్లో పలు ప్రధాన రైళ్ల రద్దు - చెన్నై, బెంగళూరు వెళ్లే రైళ్ల రీ షెడ్యూల్.. వివరాలు..!!

రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. కాజీపేట-బల్లార్షా రైల్వే సెక్షన్‌లో ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ లో భాగంగా కొన్ని రైళ్ల రద్దుతో పాటుగా మరి కొన్ని ప్రధాన రైళ్లను రీ షెడ్యూల్ చేసారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. ఈ రైళ్ల రద్దు.. రీ షెడ్యూల్ వివరాలను వెల్లడించారు.

తెలంగాణలోని జమ్మికుంట-పొత్కపల్లి మధ్య 17 కిలోమీటర్ల మేర ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ఏర్పాటుకు నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనులు చేపడుతున్నారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌ అధికారులు ఈనెల 10న పలు రైళ్లను పూర్తిగా, మరికొన్నిం టిని పాక్షికంగా రద్దు చేయడంతోపాటు దూర ప్రాంతాల సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లను 30 నుం చి 75 నిమిషాల వరకు నియంత్రించనున్నా రు. దీంతో పలు రైళ్లపై ప్రభావం పడనున్నది. ఈనెల 10న 17003/04 కాజీపేట-సిర్పూర్‌ టౌన్‌, బల్లార్షా- కాజీపేట రామగిరి మెము ఎక్స్‌ప్రెస్‌ను పూర్తిగా రద్దు చేశారు. 17033/34 భద్రాచలం రోడ్‌-బల్లార్షా, సిర్పూర్‌ టౌన్‌-భద్రా చలం రోడ్‌ సింగరేణి మెము ఎక్స్‌ప్రెస్‌ను వరం గల్‌-బల్లార్షా, సిర్పూర్‌ టౌన్‌-వరంగల్‌ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. అలాగే 17011/12 హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-బీదర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట-సి ర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య పాక్షి కంగా రద్దు చేశారు.

 సురేఖ అడుగులు ఆ పార్టీ వైపే, కండీషన్స్ అప్లై - కీలక మంత్రాంగం..!!
సురేఖ అడుగులు ఆ పార్టీ వైపే, కండీషన్స్ అప్లై - కీలక మంత్రాంగం..!!
railways-cancel-and-reschedule-of-many-trains-due-to-maintenance-works-in-kazipet-balarsha-section

పలు రైళ్ల రీ షెడ్యూల్

అదే విధంగా 10న సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే 17233 భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ను గంటపాటు రీషెడ్యూల్‌ చేశారు. 67771/73 సిర్పూర్‌ టౌన్‌-కరీంనగర్‌, కరీంనగర్‌-బోధన్‌ మెము ప్యాసింజర్‌ రైలును కూడా గంట పాటు రీషెడ్యూల్‌ చేశారు. సెప్టెంబరు 9న 22365 దానాపూ ర్‌-ఎస్‌ఎంవీటీ బెంగళూరు సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను 75 నిమిషాలు, 22366 ఎస్‌ఎంవీటీ బెంగళూరు-దానాపూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ను 45 నిమిషాలు నియంత్రించనున్నారు. ఈనెల 10న 12622 చెన్నై సెంట్రల్‌-శ్రీమాత వైష్ణోదేవి కట్రా అండమాన్‌ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను 30 నిమిషాలు, ఈనెల 9న 12622 న్యూఢిల్లీ- చెన్నై సెంట్రల్‌ తమిళనాడు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ను 30నిమిషాలు నియంత్రించనున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+