తెలుగు రాష్ట్రాలకు రెండు వందే సాధారణ్ రైళ్లు - మార్గాలు ఖరారు..!!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పేదల వందేభారత్ గా నిలుస్తున్న రెండు వందే సాధారణ్ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయిస్తూ నిర్ణయించింది. వందేభారత్ పూర్తి ఏసీ కోచ్ లతో ఉండగా, ఇవి నాన్ ఏసీ కోచ్ లతో నడిసే సాధారణ ఎక్స్ ప్రెస్ రైళ్లు. వందేభారత్ లో టికెట్ ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. కానీ, వందేసాధారణ్ రైళ్లు అందరికీ అందుబాటులో ఉండేలా రైల్వే శాఖ సిద్దం చేసింది. వందే భారత్ రూపం..వేగంతో నడిచే ఈ రైళ్లు మరి కొద్ది రోజుల్లో పట్టాలెక్కనున్నాయి.

పేదల వందేభారత్ సిద్దం:చూడటానికి వందేభారత్ తరహాలోనే ఉన్నా...వందే సాధారణ్ పేదల వందేభారత్ గా నిలుస్తోంది. ఇందులో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో సిద్దమైన తొలి రైలును పశ్చిమ రైల్వేకు కేటాయించారు. ఇది రెండు రోజుల క్రితం ముంబాయికి చేరుకుంది. ఈ రైలును ముంబై - ఢిల్లీ మధ్య నడిపే యోచనలో అధికారులు ఉన్నారు. ఇప్పటికే వందే సాధారణ్ రైళ్ల కోసం అయిదు మార్గాలకు రైల్వే బోర్డు అనుమతి తెలిపింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు అవకాశం దక్కింది. హైదరాబాద్ - న్యూ ఢిల్లీ మధ్య వందే సాధారణ్ కు లైన్ క్లియర్ అయింది. మరో 13 మార్గాల్లో నడిపేందుకు ప్రతిపాదనలకు ఆమోదం రావాల్సి ఉంది. అందులో హైదరాబాద్ - నాగర్ కోయల్ సర్వీసు ఉంది. ఈ జాబితాకు ఆమోదం లభిస్తే హైదరాబాద్ నుంచి రెండు వందేసాధారణ్ రైళ్లు ప్రారంభం అవుతాయి.

Railways likely to introduce two Vande Sadhran Trains form Hyderabad soon

హైదరాబాద్ నుంచి రెండు రైళ్లు:వందేభారత్ తరహాలోనే వందేసాధారణ్ రైళ్లు కాషాయ - నలుపు కాంబినేషన్ తో వస్తున్నాయి. వందేభారత్ తరహాలోనే శి కూడా ఫుష్ పుల్ ఇంజన్లతో నడుస్తాయి. అయితే, వందేభారత్ లో ఇంజిన్లు విడిగా ఉండవు. రైలులోనే అంతర్భాగంగా ఉంటాయి. వందేసాధారణ్ లో మాత్రం డబ్ల్యూపీ-5 లోలకో మోటికవల్ లను ముందు ఒకటి..వెనుక ఒకటి అమరుస్తారు. వందేసాధారణ్ రేక్ 130 కిమీ వేగాన్ని తట్టుకుంటాయి. ఈ రైళ్లల్లో 12 స్లీపర్ క్లాస్ కోచ్ లు..8 జనరల్ కంపార్టుమెంట్లు ఉంటాయి. ప్రతీ కోచ్ లో సీసీటీవీ కెమేరాలు, ప్రతీ సీటు వద్ద ఫఓన్ ఛార్జింగ్ పాయింట్లు, మడత స్నాక్ టేబుల్స్, లగేజీ రర్యాక్, అగ్ని నియంత్రణ వ్యవస్థ ఉంటాయి. సెమీ పర్మనెంట్ కప్లర్స్ వ్యవస్థ వల్ల కుదుపులు తక్కువగా చెబుతున్నారు. ఈ రైళ్లు 8.36 నిమిషాల్లో 110 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటాయి. 130 కిలో మీటర్ల వేగాన్ని 9.2 నిమషాల్లో చేరుకుంాయని అధికారులు చెబుతున్నారు.

Railways likely to introduce two Vande Sadhran Trains form Hyderabad soon

దీపావళికి ప్రారంభించే ఛాన్స్:ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందేభారత్ రైళ్లు కొనసాగుతున్నాయి. వీటికి ఆశించిన స్థాయిలో ఆదరణ ఉంది. దీంతో. సికింద్రాబాద్ - పూణే మధ్య కొత్త వందేభారత్ సర్వీసును త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, సాధారణ ప్రజలకు సైతం వందేభారత్ తరహాలోనే నాన్ ఏసీ రైళ్లను దగ్గర చేసేందుకు ఇప్పుుడు వందే సాధారణ్ రైళ్లను తీసుకొస్తున్నారు. అందులో హైదరాబాద్ నుంచి ఒకటి ఇప్పటికే ఢిల్లీ వరకు ఖరారు కాగా, మరో రైలు ప్రతిపాదనల స్థాయిలో ఉంది. ఇవి అందుబాటులోకి వస్తే అన్ని వర్గాల ప్రయాణీకులకు ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీపావళి సమయంలోనే వీటిని తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి అధికారికంగా రైల్వే శాఖ ప్రకటన చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+