తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన..ఉత్తర కోస్తా, యానాంలలో వర్షాలు..
తెలంగాణ ప్రజలకు చల్లని కబురు. తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించి ఉండడంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈ ఉపరితల ద్రోణి మరాఠ్వాడా నుండి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అంతర్భాగంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.
దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. సోమ, మంగళవారాల్లో తెలంగాణ లోని ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోసర్తు వర్షాలు పడే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్కడక్కడా చిరు జల్లులకు అవకాశం ఉందంటున్నారు. అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. తెలంగాణలో రానున్న 48 గంటల్లో అక్కడక్కడ వర్షాలు పడే సూచనలున్నట్లు అధికారులు వెల్లడించారు.

తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 0.5 నుంచి 31.8 మిల్లిమీటర్ల వరకు వర్షాలు కురిసినట్లు అధికారులు వెల్లడించారు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 31.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్లలో 16.8, రంగారెడ్డిలో 15.7, నారాయణ పేటలో 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఖమ్మం, నల్గొండ జిల్లాలు మినహా తెలంగాణలో గత మూడు రోజుల నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రాత్రిపూట ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రంలోగా వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డిలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వాతావరణ శాఖ చల్లని కబురును తీసుకొచ్చింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. దక్షిణ కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందన్నారు. ఎపీలోని పలు ప్రాంతాల్లో పగటిపూట మంచు ప్రభావం కొనసాగుతుందని ఐఎండీ అధికారులు తెలిపారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications