కూతుళ్లను చంపి రిలాక్సయ్యా, హ్యాపీగా ఉంది: రజనీ
హైదరాబాద్: తన భర్త నుంచి తన కూతుళ్లను కాపాడుకోవడానికే తాను వారిని హత్య చేశానని రజనీ అనే మహిళ చెప్పినట్లు సమాచారం. భర్తపై కోపంతో పిల్లలను కన్నతల్లే హత్య చేసిన దారుణ ఘటన సికింద్రాబాదులోని అడ్డగుట్ట టీచర్స్ కాలానీలో జరిగిన విషయం తెలిసిందే.
తల్లి రజనీని అరెస్టు చేసిన పోలీసులు ఎందుకు హత్య చేశావని అడిగితే భర్త నుంచి పిల్లలను కాపాడుకోడానికే హత్య చేశానని ఆమె చెప్పింది. దీంతో పోలీసులు భర్త వినయ్‌ను కూడా ప్రశ్నిస్తున్నారు. ఆమెపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.
పిల్లలను హత్య చేసినందుకు రజనీలో భయం గానీ బాధ గానీ వ్యక్తం కావడం లేదు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చిన వినయ్, రజనీ దంపతులు ఈస్ట్ మారేడ్‌పల్లి టీచర్స్ కాలనీలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. తవిష్క (7) యుకేజీ చదువుతోంది. రెండో కుమార్తె తాన్వి (3)ని ప్లే స్కూల్‌లో చేర్చారు.

పిల్లలను ఎందుకు చంపావని పోలీసులు ప్రశ్నిస్తే ఆరు నెలల క్రితం పెద్ద కుమార్తె తవిష్క తండ్రి తనను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తున్నాడని చెప్పిందని, ఆ తర్వాత తల్లి కూడా ఇదే విషయాన్ని స్వయంగా గుర్తించిన తర్వాత తన బిడ్డను తండ్రే లైంగికంగా వేధిస్తున్నాడని తాను నిర్ధారించుకన్నానని రజని చెప్పింది.
అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఇదే ఘర్షణ జరిగింది. భర్త ప్రవర్తను జీర్ణించుకోలేక, భవిష్యత్‌లో పిల్లలకు ఎలాంటి కష్టం రాకుండా ఉండేందుకు తానే ఇద్దరిని హత్య చేసి చంపేసినట్లు రజని పోలీసులకు వివరించింది. అయితే రజని మాటల్లో నిజం లేదని భర్త వినయ్ తెలిపారు.
పిల్లలను హత్య చేసిన తర్వాత బుధవారం అర్థరాత్రి సమయంలోనే రజిత హుస్సేన్‌సాగర్ వద్దకు వెళ్లింది. అక్కడికి ఎందుకు వెళ్లావని ప్రశ్నించినప్పుడు పిల్లలను చంపేసిన తర్వాత తనకు ఎలాంటి పాపం అంటకుండా సాగర్ నీళ్లతో తనను తాను కడిగేసుకునేందుకు వెళ్లానని రజని చెప్పింది.

కూతుళ్లను చంపేసిన తర్వాత చాలా రిలాక్స్ అయ్యానని, హ్యాపీగా ఉన్నానని రజనీ పోలీసులతో చెప్పిదంి. రెండు నెలలుగా తన భర్త నుంచి తన బిడ్డలకు హాని ఉందని చాలా కుమిలిపోయానని, ఇక ఏం జరుగుతుందోననే ఆందోళన ఉండదని ఆమె అన్నది.
తలపై హుస్సేన్‌సాగర్ నీళ్లు చల్లుకుని ఒంటిని శుభ్రం చేసుకున్నానని, తనకు ఇక ఏ పాపమూ ఉండదని, అందుకే అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చానని చెప్పింది. రెండు నెలలుగా తన పెద్ద కూతురు తండ్రి వినయ్ వద్దకు వెళ్లడం లేదని, ఆయన లేనప్పుడు ఇంట్లో బాగానే ఉంటున్న అమ్మాయి ఆయనను చూడగానే భయపడి పోతోందని చెప్పింది.
తమ అమ్మాయి తండ్రి లైంగిక వేధింపులకు గురై భయపడుతోందని తన అంతరాత్మ చెప్పిందని, తన మనసు ఎప్పుడు కూడా తప్పు చెప్పదని, ఆత్మసాక్షిగా అది నిజమేనని అనుకున్న తర్వాత తన మనసు నిలకడగా లేదని రజనీ చెప్పింది.
తాను ప్రాణంగా చూసుకునే అమ్మాయిలు ఏదో ఒక రోజు తండ్రి చేతిలో అత్యాచారానికి బలైపోతారని నమ్మానని, తన పిల్లలను రక్షించుకోవడానికి మార్గం వెతికానని, వారిని చంపేయడమే కరెక్ట్ అనిపించిందని, అందుకే చంపేశానని చెప్పింది. ఇకపై తనకు ఎటువంటి చింత కూడా ఉండదని, తన ఇద్దరు పాపలకు తండ్రి నుంచి లైంగిక వేధింపుల భయం ఉండదని ఆమె చెప్పింది.

అయితే తన కళ్లతో ఎప్పుడు కూడా భర్త పిల్లలను లైంగిక వేధింపులకు గురి చేయడం చూడలేదని, సాక్ష్యాలు తేవాలంటే తన వద్ద లేవని రజనీ చెప్పింది.
కాగా, కన్నకూతుళ్లపై, అందులోనూ ముక్కుపచ్చలారని పసివారిపై తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రజని చెప్పడం పూర్తిగా అబద్ధమని భర్త వినయ్ అంటున్నాడు. ఈ మధ్య తన భార్య మానసిక స్థితి బాగా లేదని, తనలో తానే ఏదో ఊహించుకుని అవే వాస్తవాలుగా భావించి తనతో గొడవ పడేదని చెప్పాడు.
హత్య జరిగిన రోజు ఉదయం భార్యాపిల్లలతో గుడికి వెళ్లి వచ్చానని, ఇంటికి వచ్చిన తర్వాత రజని తనతో లైంగిక వేధింపుల ప్రస్తావన తెచ్చి గొడవ పడిందని చెప్పాడు. ఆమె మానసిక స్థితి బాగా లేదని తెలిసి తానేమీ మాట్లాడకుండా ఆఫీసుకు వెళ్లానని చెప్పాడు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications