ట్విస్ట్ ల మీద ట్విస్ట్: శిరీష, తేజస్విని వదిలించుకోవాలని, పెళ్ళి కోసమే ఇలా..

బ్యూటీషీయన్ శిరీష కేసులో నిందితుడు రాజీవ్ సంచలన విషయాలను పోలీసులకు వెల్లడించారు.శారీరక సంబంధాలున్న బ్యూటీషీయన్ శిరీష, తేజస్వినిని వదిలించుకోవాలని భావించాడు.అయితే తేజస్వినితో వివాహనికి రాజీవ్ ఇంట్లో ఒ

హైదరాబాద్: బ్యూటీషీయన్ శిరీష కేసులో నిందితుడు రాజీవ్ సంచలన విషయాలను పోలీసులకు వెల్లడించారు.శారీరక సంబంధాలున్న బ్యూటీషీయన్ శిరీష, తేజస్వినిని వదిలించుకోవాలని భావించాడు.అయితే తేజస్వినితో వివాహనికి రాజీవ్ ఇంట్లో ఒప్పుకోలేదు. ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఏం చేశాడో కానీ, శిరీష బాగా భయపడిపోయిందని రాజీవ్ పోలీసుల విచారణలో వెల్లడించారు.

బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులైన రాజీవ్, శ్రవణ్ ల ను రెండురోజులపాటు కస్టడీకి తీసుకొన్నారు పోలీసులు . సోమవారం నాడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాజీవ్, శ్రవణ్ లను పోలీసులు విచారించారు.

ఈ కేసులో తొలి నుండి అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు శిరీష కుటుంబసభ్యులు. శిరీషను హత్య చేశారని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో కూడ కుటుంబసభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజు కొన్ని విషయాలపై పోలీసులు తమ అనుమానాలను నివృత్తిని చేసుకొనే ప్రయత్నం చేశారు.

మరోవైపు ఇంకా ఈ కేసులో చిక్కువీడని అనుమానాలు ఉన్నాయని ఈ రెండు కుటుంబాలకు చెందిన వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అనుమానాలు ఈ రెండురోజుల కస్టడీలో వెల్లడి అయ్యే అవకాశాలున్నాయని పోలీసులు విశ్వసిస్తున్నారు.

 సంచలన విషయాలు వెల్లడించిన రాజీవ్

సంచలన విషయాలు వెల్లడించిన రాజీవ్

బ్యూటీషీయన్ శిరీష కేసులో నిందితుడు రాజీవ్ సంచలన విషయాలు వెల్లడించారు. అయితే శిరీషతో పాటు , తేజస్వినిని కూడ వదిలించుకోవాలని రాజీవ్ భావించారు. ఈ మేరకు తొలిరోజు పోలీసు కస్టడీలో ఈ విషయాన్ని విచారణలో రాజీవ్ వెల్లడించారని సమాచారం. వీరిద్దరి కారణంగా తనకు ఇబ్బందులు ఎదురౌతాయని రాజీవ్ భావించారు. అందుకే ఇద్దరితో సంబంధాలను తెంచేసుకోవాలని భావించాడు. ఈ మేరకు శిరీషను వదిలించుకొనేందుకు కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సహయం తీసుకొన్నట్టు రాజీవ్ పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం.

 తేజస్వినితో పెళ్ళికి ఒప్పుకోలేదు

తేజస్వినితో పెళ్ళికి ఒప్పుకోలేదు


రాజీవ్ ను పెళ్ళిచేసుకొంటానంటూ తేజస్విని రాజీవ్ తల్లితో చెప్పింది. అయితే ఈ పెళ్ళికి రాజీవ్ తల్లి ఒప్పుకోలేదు.రాజీవ్ కు వివాహం చేయాలని కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు.ఈ మేరకు వివాహ సంబంధాలు కూడ చూస్తున్నారు.ఈ సమయంలో తేజస్విని, శిరీషల వ్యవహరం బయటకు తెలిస్తే వివాహం చేసుకొనే సమయంలో ఇబ్బందిపడే అవకాశం ఉంటుందని రాజీవ్ భావించాడు. అందుకే వివాహనికి ముందే వీరిద్దరితో తెగతెంపులు చేసుకోవాలని భావించాడు.

శిరీషను బెదిరించాలనుకొన్నాం

శిరీషను బెదిరించాలనుకొన్నాం

బ్యూటీషీయన్ శిరీషను వదిలించుకోవాలని భావించడంతో శ్రవణ్ సహకారం తీసుకొన్నట్టుగా రాజీవ్ పోలీసులకు వివరించారు. ఈ విషయమై శ్రవణ్ తనకు అన్ని రకాలుగా సహకరించినట్టుగా విచారణలో పోలీసులకు ఆయన చెప్పారని సమాచారం. మరో వైపు శిరీషను బెదిరించేందుకే కుకునూర్ పల్లికి తీసుకెళ్ళినట్టు రాజీవ్ పోలీసుల విచారణలో వెల్లడించారని సమాచారం.బెదిరిస్తే ఆమె తమకు దూరంగా ఉంటే , ఎలాగోలా తేజస్వినిని కూడ దూరం చేసుకొంటే పెళ్ళిచేసుకోవాలని రాజీవ్ భావించారని సమాచారం.

శిరీషను చంపాలనే ఉద్దేశ్యం లేదు

శిరీషను చంపాలనే ఉద్దేశ్యం లేదు


అయితే కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఏం చేశారో తెలియదని రాజీవ్ చెప్పారు. కుకునూర్ పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి శిరీషను ఏం చేశారో కానీ, ఆమె తీవ్రంగా భయపడిందని రాజీవ్ పోలీసులకు చెప్పారు. ఆమె గట్టిగా అరిచింది. ఆ అరుపులతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆమెను కొట్టినట్టు రాజీవ్ పోలీసుల విచారణలో తేలిందన్నారు. ఆమెను వదిలించుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను తెలిసి శిరీష ఆత్మహత్య చేసుకొందని రాజీవ్ ప్రకటించారు

హోంగార్డు బిక్షపతిని విచారించనున్న పోలీసులు

హోంగార్డు బిక్షపతిని విచారించనున్న పోలీసులు

కుకునూర్ పల్లి పోలీస్ క్వార్టర్ లో శిరీష, శ్రవణ్, రాజీవ్ ,ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిలకు స్నాక్స్ సరఫరా చేసిన హోంగార్డు బిక్షపతిని పోలీసులు విచారించే అవకాశం ఉంది. అసలు ఆరోజు ఏం జరిగిందనే విషయాలపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేసే అవకాశం ఉంది. మరోవైపు కుకునూర్ పల్లికి వెళ్ళే దారిలోని సిసి కెమెరాల దృశ్యాలను కూడ పోలీసులు పరిశీలించనున్నారు. ఈ దృశ్యాల ఆధారంగా కూడ ఇంకా ఆధారాలు ఏమైనా దొరికే అవకాశాలున్నాయా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ జరుపనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+