రెఢీ ఫర్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్,టీఆర్ఎస్
మరో మూడు రోజుల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అప్రత్తమైంది. ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక నాయకులు, మంత్రులు,ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్ లతో సమావేశమయ్యారు.కాగా సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇతర నేతలు హజరయ్యారు.
మూడు విడతల్లో ఎన్నికలు
కాగా ఎన్నికల నిర్వహాణకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరో రెండు మూడు రోజుల్లో ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. కాగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో మొదటి విడత జరిగే ఎన్నికలకు ఈనెల 22 నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు .కాగా మే 6, 10 ,14 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.













Click it and Unblock the Notifications