సీఎం గారూ చూస్తున్నారా.?గిరిజన భూముల్లో రియల్ ఎస్టేట్ దందా.?కేసీఆర్ కు బండి సంజయ్ లేఖాస్త్రం.!

హైదరాబాద్: దళితులు, గిరిజనుల భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలను ఆపాలని, వారికి ఉన్న కనీస జీవనాధారాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తూ సీఎం చంద్రశేఖర్ రావుకు తెలంగాణ బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ లేఖ రాసారు. ఎన్నో ఏళ్ల క్రితం దళితులకు, గిరిజనులకు అసైన్‌ చేసిన భూములకు గులాబీ ప్రభుత్వం రక్షణ కల్పించకపోగా, వారి జీవనాధారాన్ని దెబ్బతీస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని ప్రోత్సహించడం దుర్మార్గమన్నారు బండి సంజయ్.

అసైన్డ్‌ భూముల్లో రియల్ దందా దారుణం : అంతే కాకుండా దళితులకు, గిరిజనులకు మూడు ఎకరాల సాగుభూమి ఇస్తామన్న హామీని గులాబీ ప్రభుత్వం వమ్ము చేయడంతో లక్షలాది మంది దళితులు, గిరిజనుల ఆశలు అడియాసలయ్యాయని ఆవేదన వ్యక్తం చేసారు బండి సంజయ్. అది పోగా ఎప్పుడో గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్‌ భూముల్లో దళిత, గిరిజన కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటుంటే రియల్‌ వ్యాపారం కోసం ఆ భూములను లాక్కోవాలని చూడడం వారి నోటి కాడి ముద్ద లాక్కోవడమేనన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిస్తానంటూ హామీలివ్వడమే కానీ, వాటిని అమలులో చూపెట్టడం లేదని మండిపడ్డారు బండి సంజయ్.

 bandikcr1

సిద్దిపేటలో దళితుల భూమిలో వెంచర్ వేయడం అమానుషం : సిద్దిపేటలో సీఎం చంద్రశేఖర్ రావు ప్రారంభించిన వెంచర్‌ దళితుల భూముల్లోనే అనే అంశం సీఎం కు తెలుసా అని ప్రశ్నించారు. శంషాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలకు ప్రయత్నిస్తున్నది గిరిజన భూముల్లోనేనని, ఇవి మచ్చుకు కొన్ని మాత్రమేనన్నారు బండి సంజయ్. రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు, గిరిజనులకు కేటాయించిన అసైన్డ్‌ భూములను వారి నుంచి లాక్కుంటున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయని, సమాజంలో అత్యంత వెనుకబడిన దళితులకు, గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అని బండి సంజయ్ లేఖలో నిలదీసారు.

దళితులు, గిరిజనుల జీవనోపాది నామమాత్రం : సీఎం కుటుంబం మాత్రం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారు, దళితులు, గిరిజనుల పట్ల మాత్రం తీవ్ర వివక్ష చూపిస్తున్నారని, దళితుల సంక్షేమమంటే ఎత్తైన విగ్రహాలు, పాలనా భవంతులకు పేర్లు కాదని, వారికి జీవనోపాధి కల్పించడమే ముఖ్యమన్నారు బండి సంజయ్. నామమాత్రంగా ఉన్న జీవనోపాధిని సైతం కోల్పోయి బీఆర్ఎస్ పాలనలో దళితులు, గిరిజనలు అన్ని విధాల తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వంలో దళితులకు, గిరిజనులకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందన్నారు బండి సంజయ్ కుమార్.

 bandikcr1

సీఎం దృష్టం సారించాలన్న బండి సంజయ్ : ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లింపులో నిర్లక్ష్యం వల్ల గులాబీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఇప్పటికే చదువుకు దూరం అవుతున్నారని, ఇప్పుడు దళితులను, గిరిజనులకు మభ్యపెట్టి, భయపెట్టి వారి భూములు లాక్కొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి పూనుకోవడం అత్యంత శోచనీయమన్నారు. దళితులు, గిరిజనుల బతుకులు ఆగం చేసే చర్యలను ప్రభుత్వం వెంటనే విడనాడాలని బిజెపి డిమాండ్‌ చేస్తుందన్నారు బండి సంజయ్. అసైన్డ్‌ భూముల్లో రియల్‌ దందాకు తెరదించాలని, దళితులకు న్యాయబద్ధంగా వచ్చిన భూములకు రక్షణ కల్పించాలని, లేకుంటే దళితులు, గిరిజనుల పక్షాన బిజెపి తెలంగాణ శాఖ పెద్దఎత్తున ఆందోళన చేపడుతుందని బండి సంజయ్ లేఖలో హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+