కేసీఆర్ ఇంతకన్నా ఇంకేం చేస్తాడు: ఖైదీలే ధైర్యం చెప్పారన్న రేవంత్

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టై నెల రోజుల పాటు చర్లపల్లి జైలులో ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపనేత రేవంత్ రెడ్డికి అక్కడి ఖైదీలే ధైర్యం నూరిపోశారంట. ఈ విషయాన్ని చెప్పిందో ఎవరో కాదు, సాక్షాత్తూ రేవంత్ రెడ్డే స్వయంగా వెల్లడించారు.

ఆదివారం ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్యూలో ఆయన పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. జైలులో తనను ఓ వీఐపీ ఖైదీగా పరిగణించిన జైలు అధికారులు తనకు వంట మనిషిగా జీవిత ఖైదు పడిన నాగయ్య అనే ఖైదీని నియమించారని రేవంత్ రెడ్డి చెప్పారు.

 Revanth Reddy about TRS Operation Aakarsh

ఈ సందర్భంగా నాగయ్య తనతో చెప్పిన పలు అంశాలను రేవంత్ రెడ్డి వివరించారు. 'జైలుకే వచ్చారు. కేసీఆర్ ఇంకేం చేస్తాడు?' అని నాగయ్య తనలో ధైర్యం నింపారని చెప్పారు. అంతేకాదు కేసీఆర్‌కు, తనకు మధ్య జరుగుతున్న వైరాన్ని నాగయ్య విశ్లేషించిన తీరు ఇప్పటికీ గుర్తుకొస్తోందని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

'సావుకు మించిన ధైర్యం లేదు. గోసిగుడ్డకు మించిన దరిద్రం లేదు. మీలాంటోళ్లు ఇంత దూరం రావొద్దు. జైలుకే వచ్చిండ్రు. ఇక కేసీఆర్ మిమ్మల్ని ఏం చేస్తడు? ఏదైతే అదే జరుగుద్ది!' అంటూ తన గదిలో ఉన్న ముగ్గురు ఖైదీలు కూడా తనలో ధైర్యం నూరిపోశారని రేవంత్ రెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+