• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిల లక్ష్యానికి రేవంత్ బ్రేకులు - సైలెంట్ ఆపరేషన్: జగన్ ఓన్ చేసుకున్నారు- బాణం గురి తప్పింది ..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

తెలంగాణలో రాజన్న రాజ్యం . వైఎస్సార్ కుమార్తె షర్మిల లక్ష్యం-నినాదం ఇదే. ఫిబ్రవరి 9న తెలంగాణలో రాజకీయ ఎంట్రీ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. జూలై 8న వైఎస్సార్టీపీ పార్టీ పేరును ఖరారు చేసారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ లక్ష్యంగా... నిరుద్యోగులకు మద్దతుగా దీక్షలు చేస్తున్నారు. ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో...వారి ఇంటికి వెళ్లి పరామర్శించి..అక్కడే దీక్షలు చేస్తున్నారు. తాజాగా ఇటువంటి దీక్ష కోసం సిద్దమైన సమయంలో బాధితుడి కుటుంబం నుంచి తమ ఇంటికి రావద్దంటూ సమాచారం వచ్చింది.

 షర్మిల అంచనాలు తప్పుతున్నాయా..

షర్మిల అంచనాలు తప్పుతున్నాయా..

రాజకీయంగా తెలంగాణలో ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న షర్మిల అందుకు తగిన విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోలేదు. తన తండ్రి ఛరిష్మా తనకు కలిసి వస్తుందని అంచనా వేసారు. కానీ, అదంతా తన అన్న ఓన్ చేసుకున్నారని..తాను గతంలో తన అన్నకు మద్దతుగా పాదయాత్రలు - ప్రచారం చేయటంతో తన అన్నకే ఆ వారసత్వం వెళ్లిపోయిందని ఆలస్యంగా గుర్తించారు. ఇప్పటికీ తెలంగాణలో వైఎస్సార్ అభిమానులు ఉన్నా..షర్మిల పార్టీ భవిష్యత్ పైన వారిలో నమ్మకం కలిగించే విధంగా కార్యక్రమాలు జరగటం లేదు. రాజకీయ వ్యూహాలు లేవు.

 రేవంత్ సైలెంట్ ఆపరేన్..

రేవంత్ సైలెంట్ ఆపరేన్..

అసలు షర్మిల వెనుక చెప్పుకోదగిన స్థాయిలో నేతలు లేరు. షర్మిల కోటరీలో ఉన్న వారు తెలంగాణ రాజకీయాల పైన... క్షేత్ర స్థాయిలో రాజకీయ అంశాల పైన అంతగా అవగాహన లేని వారనే ప్రచారం ఉంది. అయితే, టీపీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు స్వీకరించే వరకూ షర్మిల పేరు కొంత బలంగానే ప్రచారం సాగింది. కేసీఆర్ - కేటీఆర్ లక్ష్యంగా చేసిన విమర్శ లకు ప్రచారం లభించింది. కానీ, రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత పరిస్థితిలో పూర్తి మార్పు కనిపిస్తోంది. అప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత కుమ్మలాటలు- బీజేపీ పూర్తి స్థాయిలో పుంజుకోకపోవటం.. గులాబీ పార్టీని వ్యతిరేకంచే వారికి బలమైన వేదిక కనిపించ లేదు. కానీ, రేవంత్ చీఫ్ అయిన తరువాత పార్టీలో జోష్ పెరిగిందని అందరూ అంగీకరించే విషయం.

 ఆ వర్గాలు షర్మిల వైపా..రేవంత్ కే మద్దతా..

ఆ వర్గాలు షర్మిల వైపా..రేవంత్ కే మద్దతా..

అదే సమయంలో షర్మిల తనకు రెడ్డి సామాజిక వర్గంతో పాటుగా..దళిత ఓట్ బ్యాంకు తనకు మద్దతుగా ఉంటుందని అంచనా వేసారు. కానీ, రేవంత్ రెడ్డి తెలంగాణలో బీసీ ల తరువాత ప్రధాన వర్గంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకుంటున్నారు. రేవంత్ సైతం అదే సామాజిక వర్గం కావటంతో..సహజంగానే కేసీఆర్ వ్యతిరేక రెడ్డి వర్గం రేవంత్ వైపు నిలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి. వైఎస్సార్ అభిమానులు తనతోనే ఉంటారని షర్మిల అంచనాలు వేసారు. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంటూ...వారిని సైతం కాంగ్రెస్ కు మద్దతుగా తిప్పుకొనే యత్నాలు రేవంత్ చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్ కు దూరమైన సాంప్రదాయ ఓట్ బ్యాంకును తిరిగి దగ్గరకు చేర్చుకొనేందుకు రేవంత్ దళిత-గిరిజన దందోరా పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

 హుజూరాబాద్ బై పోల్ లో క్లారిటీ..

హుజూరాబాద్ బై పోల్ లో క్లారిటీ..

ఒక వైపు కేసీఆర్ దళిత బంధు అమలు చేస్తామంటూ..నిధులు విడుదల చేస్తున్న సమయంలో దళిత ఓటింగ్ ఎవరి వైపు అన్నది ఆసక్తి కరంగా మారుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో దీనికి సంబంధించి సంకేతాలు వెలువడే ఛాన్స్ ఉంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చ ఏడేళ్లు అవుతోంది. కానీ, కొత్తగా పార్టీ పెట్టిన షర్మిల ఇప్పటి వరకు ఒక అంశాన్నే ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. తన పక్కనే ఉన్న నేతలు సైతం పార్టీ వదలి వెళ్లిపోతున్నా..వారిని నిలువరించటంలో విఫలమవుతున్నారు. ప్రజల్లో నుంచి నాయకులు వస్తారనే ప్రకటనలు చేస్తున్నా...ఇతర పార్టీల నుంచి చెప్పుకొనే స్థాయిలో ఉన్న నేతలెవ్వరూ షర్మిల పార్టీలోకి ఇప్పటికైతే రాలేదు.

 జగన్ ఓన్ చేసుకున్నారు..షర్మిల మాత్రం ఇలా..

జగన్ ఓన్ చేసుకున్నారు..షర్మిల మాత్రం ఇలా..

అయితే, ఏపీ రాజకీయాల్లో జగన్ కు రెడ్డి-దళిత- క్రిస్టియన్ ఓటింగ్ మద్దతుగా నిలిచింది. 2019 ఎన్నికల్లో బీసీ ఓటింగ్ సైతం కలిసి వచ్చింది. ఏపీలో రెడ్డి సామాజిక వర్గం అధిక శాతం జగన్ వైపే ఉన్నారు. కానీ, షర్మిల మద్దతు దారులు తెలంగాణలోనూ అదే జరుగుతుందని భావించినా..రేవంత్ రెడ్డి దెబ్బ తీసారు. ఇక, కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా రేవంత్ వైపు ఆ వర్గ నేతలు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. వీటన్నింటినీ గమనిస్తున్న విశ్లేషకులు మాత్రం షర్మిల రాజకీయ అడుగులు రానున్న రోజుల్లో ఉలా ఉంటాయి..తెలంగాణలో మారుతున్న సమీకరణాలను తనకు మద్దతుగా ఎలా మలచుకోగలుగుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Revanth Reddy moving strtegical steps against Sharmila in telangana politics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X