వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు వచ్చేలోపే టీడీపీ నాశనం, కేసీఆర్‌ నెత్తిన పాలు: రేవంత్ సంచలనం

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆ పార్టీ తెలంగాణ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ సీనియర్ నేతలు ఎల్ రమణ, మోత్కుపల్లి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆ పార్టీ తెలంగాణ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ సీనియర్ నేతలు ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్ కుమార్ ఇప్పటికే రేవంత్‌పై విమర్శలు సంధిస్తున్న నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

 కేసీఆర్‌పైనే పోరాటం..

కేసీఆర్‌పైనే పోరాటం..

కాగా, తన పోరాటం తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావుపైనేనని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. టీడీపీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు కేసీఆర్ నెత్తిన పాలుపోసేలా ఉన్నాయని అన్నారు.

బాధగా ఉంది..

బాధగా ఉంది..

టీడీపీలో అంతర్గతంగా గొడవలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏ నాయకుడైనా కేడర్ కోరుకునే విధంగానే నడుచుకోవాలని రేవంత్ స్పష్టం చేశారు. టీడీపీ కేడర్‌ను చూస్తే బాధగా ఉందని రేవంత్ అన్నారు.

బాబు ఫుల్ పవర్స్ ఇచ్చారు, ఇక రేవంత్ అంతే: రమణ, ‘వేటు తొందరపాటే'బాబు ఫుల్ పవర్స్ ఇచ్చారు, ఇక రేవంత్ అంతే: రమణ, ‘వేటు తొందరపాటే'

 బాబు వచ్చే లోపే నాశనం..

బాబు వచ్చే లోపే నాశనం..

తనను పరుష పదజాలంతో విమర్శించినా రమణ నోరుమెదపలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వచ్చాక, ఆయనే జరిగిన పరిణామాలన్నీ వివరిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే, చంద్రబాబు హైదరాబాద్ వచ్చే లోపే పార్టీని నాశనం చేయాలని కొందరు తాపత్రయపడుతున్నారని రేవంత్ ధ్వజమెత్తారు.

 ఎల్ రమణ మరోసారి..

ఎల్ రమణ మరోసారి..

ఇది ఇలా ఉండగా, రేవంత్ రెడ్డికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మరోసారి మెసేజ్ పెట్టారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీపీ ఎల్పీ నేతగా ఏ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఎల్ రమణ. రేవంత్ కు ఆ సందేశంలో స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగాలని తేల్చి చెప్పారు.

తగ్గిన రేవంత్: టీడీపీఎల్పీ భేటీ రద్దు అందుకే, ఐనా వేటుకు ముమ్మరయత్నాలుతగ్గిన రేవంత్: టీడీపీఎల్పీ భేటీ రద్దు అందుకే, ఐనా వేటుకు ముమ్మరయత్నాలు

 పార్టీపై రేవంత్ ఎజెండా..

పార్టీపై రేవంత్ ఎజెండా..

కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని టీడీపీ సీనియర్ నేత అరవింద్ కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డి తన వ్యక్తి గత ఎజెండాను పార్టీపై రుద్దెందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

English summary
MLA Revanth Reddy on Thursday fired at at TTDP leaders for
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X