తొలి అవకాశం, చంద్రబాబు స్వేచ్ఛనిచ్చారు: పాలేరు ఉప ఎన్నికపై రేవంత్
విజయవాడ: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో అభ్యర్థి నిలిపే విషయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పూర్తి స్వేచ్ఛనిచ్చారని ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. పాలేరు ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపే విషయంపై చంద్రబాబునాయుడుతో శనివారం భేటీ అయ్యారు తెలంగాణ టీడీపీ నేతలు.
ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితోపాటు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
పాలేరు ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపే అంశంపై తెలంగాణ శాఖకు చంద్రబాబునాయుడు పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలిపారు. సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఈ సమావేశంలో పాల్గొనలేదని, అందరు నేతలతో చర్చించిన అనంతరం పోటీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

తెలంగాణలో పార్టీని నడుపుకోవాల్సింది, బలోపేతం చేయాల్సింది మీరేనని తమకు చంద్రబాబు సూచించారని రేవంతర్ రెడ్డి తెలిపారు. కాగా, పోటీ లేకపోవడం ప్రత్యేక పరిస్థితి అని, గతంలో పార్టీలకతీతంగా తెలుగుదేశం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
గతంలో జరిగిన నారాయణఖేడ్ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తమను సంప్రదించలేదని అన్నారు. అన్ని పార్టీలో అక్కడ పోటీ చేయడం జరిగిందని తెలిపారు. అయితే, ఈసారి పాలేరు ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తమను సంప్రదించిందని చెప్పారు.
సిపిఐ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పిన ఆయన.. తమ పార్టీలో అందరు నేతలతో చర్చించిన తర్వాత పాలేరు ఉప ఎన్నికలపై అభ్యర్థిని నిలిపే అంశంపై నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ టీడీపీకి సొంతంగా నిర్ణయం తీసుకునేందుకు ఇది తొలి అవకాశమని తెలిపారు.
పాలేరు ఉప ఎన్నికలో పోటీలో దిగడం లేదా చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబానికి సానుభూతి తెలుపుతూ పోటీ పెట్టకపోవడం అనేవి తమ ముందున్న రెండు నిర్ణయాలని రేవంత్ చెప్పారు. టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ పార్టీ నేత భట్టి విక్రమార్కలు తమను సంప్రదించిన విషయాన్ని చంద్రబాబుకు చెప్పామని తెలిపారు.
అయితే, ఖమ్మం జిల్లా నేతలు మాత్రం నామా నాగేశ్వరరావు బలమైన అభ్యర్థి అని, ఆయడ్ని పోటీలో నిలబెట్టాలని కోరుతున్నారని చెప్పారు. ఆదివారం ఉదయం 11గంటలకు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుని వెల్లడిస్తామని తెలిపారు. తమకు ఓట్లు, సీట్లు ముఖ్యం కాదని, ప్రజలకు సేవ చేయాలనేదే పార్టీ ఉద్దేశమని తెలిపారు.












Click it and Unblock the Notifications