రాష్ట్రమంతా ఉపఎన్నికలు రావాలి: ‘ఇస్తవా.. చస్తవా’ అనే నినాదంతో రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఇంద్రవెల్లి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆదివాసీలు, దళితులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బంజారాహిల్స్‌లోని ఏఐసీసీ కార్యక్రమాలు కమిటీ ఛైర్మన్‌ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి వెళ్లారు రేవంత్ రెడ్డి, సోమవారం నిర్వహించతలపెట్టిన ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లు, ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు తదితర అంశాలపై చర్చించారు.

ఉపఎన్నిక జరిగితేనా కొత్త పథకమా?

ఉపఎన్నిక జరిగితేనా కొత్త పథకమా?

అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఉపఎన్నికలో రాజకీయ లబ్ధి పొందేందుకే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం తీసుకురావాలంటే ఉపఎన్నిక రావాల్సిందేనా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉపఎన్నికలు రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని రేవంత్ ఎద్దేవా చేశారు.

ఇస్తవా.. చస్తవా.. అనే నినాదంతో..

ఇస్తవా.. చస్తవా.. అనే నినాదంతో..

సోమవారం నుంచి సెప్టెంబర్ 17 వరకు నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. 'ఇస్తవా.. చస్తవా' అనే నినాదంతో ప్రభుత్వంపై ప్రజల తరపున పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత, గిరిజన, ఆదివాసీలకు రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ మొదటివారంలో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలో మరో నాలుగైదు ప్రాంతాల్లో ఇంద్రవెల్లి లాంటి బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు రేవంత్ చెప్పారు.

Recommended Video

    #Watch PV Sindhu కు ఘన స్వాగతం...రూ.30 లక్షల నజరానా | 2 Olympic Medals | Tokyo 2021|Oneindia Telugu
    కేసీఆర్ సర్కారుకు కనువిప్పు కలిగేలా ఇంద్రవెల్లి సభ..

    కేసీఆర్ సర్కారుకు కనువిప్పు కలిగేలా ఇంద్రవెల్లి సభ..

    సోమవారం సభతో ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంద్రవెల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరకు సంబంధించిన సమీక్ష నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి వచ్చారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. దీంతోపాటు రాష్ట్రంలో మరో నాలుగైదు బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని చెప్పారు. రేపటి ఇంద్రవెల్లి సభ విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. లక్షకు పైగా కాంగ్రెస్ శ్రేణులతో సభవను విజయవంతం చేస్తామన్నారు. రేపటి సభతో ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందన్నారు మహేశ్వర్ రెడ్డి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+