వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ 11 నెలలే, తర్వాత సిఎం రేవంత్ రెడ్డి: కొత్తకోట సంచలన వ్యాఖ్యలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలతో సాగుతున్న నియంత పాలన 11 నెలల్లో అంతం కానుందని ఆయన అన్నారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌లో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని కలిశారు.

కె. చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రభుత్వం పడిపోయిన తర్వాత వచ్చే ఎన్నికలకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎంగా రేవంత్‌రెడ్డి లేదా మరెవరైనా ఉండొచ్చని అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాయకులనే ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పారు.

Kothakota Dayakar Reddy

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తున్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గొంతునొక్కేందుకు కేసీఆర్‌ శతవిధాల ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కెసిఆర్ తమ పార్టీలో పదవులను అనుభవించి ప్రస్తుతం తిన్నిం టి వాసాలు లెక్కపెట్టేలా వ్యవహరిస్తున్నా రని ధ్వజమెత్తారు.

గతంలో పదవుల కోసం చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు సేవలు అందించిన కెసిఆర్ ఇప్పుడు విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు

English summary
Telugudesam party ex MLA Kothakota Dayakar Reddy said that CM K Chandrasekhar Rao government will not continue till the end.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X