గాల్లోకి ఎగిరి కిందపడ్డారు: నెహ్రూ జూ పార్కు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని నెహ్రూ జులాజికల్ పార్కుకు అతి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన సీసీ పుటేజ్‌లో రికార్డు అయ్యాయి.
సీసీ పుటేజ్‌లో రికార్డైన దాని ప్రకారం ఓ టూవీలర్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కుడివైపు నుంచి ఎడమవైపు రోడ్డు దాటుతుండగా, ఎదురుగా వేగంగా వచ్చిన కారు వారిని బలంగా ఢీ కొట్టింది. దీంతో టూవీలర్‌పై వెళ్తున్న ఆ ఇద్దరూ వ్యక్తులు అమాంతం గాల్లోకి ఎగిరిపడ్డారు.

ఈ రోడ్డు ప్రమాదంలో వారిద్దరికీ తీవ్ర గాయాలు కాగా, టూవీలర్ ధ్వంసమైంది. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. నగరంలోని శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, ఎస్సార్‌నగర్, యూసఫ్‌గూడ, అమీర్‌పేట, ఎర్రగడ్డతో పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది.
కూకట్‌పల్లి ప్రాంతంలో చిరుజల్లులు పడ్డాయి. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లిహిల్స్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లిలో వర్షం కురుస్తోంది. చిన్నపాటి వర్షానికే ఆయా ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications