హెచ్‌సియులో ఉద్రిక్తత: క్లాస్‌లకు వెళ్తుంటే అడ్డుకున్న ఏఎస్ఏ
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గురువారం నాడు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొందరు విద్యార్థులు రీసెర్చ్ కొనసాగిస్తామని చెప్పగా, ఏఎస్ఏ సభ్యులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్‌సియులో కొద్ది రోజులుగా ఉద్రిక్తత కనిపిస్తోంది.
Pics: HCU లో ఉద్రిక్తత
చాలామంది విద్యార్థులు తమకు క్లాసులు పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేముల రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారని కొందరు విద్యార్థులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం విద్యార్థులు రీసెర్చ్ కొనసాగిస్తామని చెబుతూ... క్లాసులకు హాజరయ్యేందుకు వెళ్లారు.

వారిని ఏఎస్ఏ సభ్యులు అడ్డుకున్నారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆయనకు న్యాయం జరిగే వరకు లోనికి వెళ్లనిచ్చేది లేదని అడ్డుకున్నారు. క్లాసులకు వెళ్తున్న ప్రతి విద్యార్థిని ఏఎస్ఏ సభ్యులు అడ్డుకుంటున్నారు. క్లాసులను బహిష్కరించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, ఇప్పటికే తమకు ఆలస్యం అవుతోందని, క్లాసులకు హాజరవుతామని విద్యార్థులు చెబుతున్నారు. సైన్స్ విభాగం ఎదుట వారు బైఠాయించారు. ఇరువర్గాల విద్యార్థులు పోటా పోటీగా నినాదాలు చేశారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నాయని ఏబీవీపీ ఇప్పటికే ఆరోపిస్తోంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications