హైదరాబాద్‌లో రూ.2.58 కోట్ల పాత నోట్లు స్వాధీనం
నగరంలోని పాతబస్తీలో రూ.2.58 కోట్ల పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో రూ.2.58 కోట్ల పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
కొందరు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి పాత నోట్లను మారుస్తామంటూ నమ్మిస్తూ మెసాలకు పాల్పడుతున్నట్లు సమాచారమందుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై నిఘా ఉంచారు. అనంతరం ఎట్టకేలకు ఈ ముఠాను పట్టుకున్నారు.

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా రూ.2.58 కోట్ల విలువైన రద్దయిన పాత నోట్ల కట్టలు వెలుగు చూశాయి. నిందితులు ఈ నోట్లను హైదరాబాద్ నుంచి బెంగళూరు తరలిస్తూ బహదూర్‌పుర పోలీసులకు పట్టుబడ్డారు.
ఇన్‌స్పెక్టర్ ఖలీల్ పాషా, ఆయన అనుచర బృందం ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిందితుల నుంచి రూ. 2.598 కోట్ల పాతనోట్లను, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications