Maha Shivaratri: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. శివరాత్రికి 1000 ప్రత్యేక బస్సులు..
శివరాత్రి కోసం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల ముస్తాబవుతోన్నాయి. భక్తులు భారీగా శివక్షేత్రాలకు తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం శివరాత్రి కోసం సిద్ధమవుతోంది. వేములవాడకు భారీగా భక్తులు తరలొచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. వివిధ ప్రాంతాల నుంచి వేములవాడకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
వేములవాడ రాజన్న ఆలయంలో జరిగే మహా శివరాత్రి జాతరకు వెయ్యి ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. మార్చి 7న.. 265 బస్సులు, 8న 400, 9న 329 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఈ ప్రత్యేక బస్సులు వరంగల్, హన్మకొండ, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, నర్సంపేట, కోరుట్ల, మెట్ పల్లి,ఆర్మూర్, కామా రెడ్డి, నిర్మల్, వేములవాడ డిపోల నుంచి నడుస్తాయని వివరించారు.

ఈ మూడు రోజులు వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయం వరకు దేవాలయం సౌజన్యంతో ఉచితంగా 14 మినీ బస్సులను కూడా నడపనున్నట్లు ప్రకటించారు. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లపై మంత్రి పొన్నం ఇప్పటికే అధికాలతో సమీక్ష నిర్వహించారు. అటు శ్రీశైలం కూడా శివరాత్రి కోసం ముస్తాబవుతోంది.
ప్రస్తుతం శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతోన్నాయి. మంగళవారం సాయంత్రం ఏపీ ప్రభుత్వం తరపున శ్రీస్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం రావణవాహనంపై స్వామిఅమ్మవార్లు దర్శమివ్వనున్నారు. రాత్రి క్షేత్ర వీధుల్లో ఆది దంపతులకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications