వారిని వదిలేది లేదు..సజ్జనార్ మాస్ వార్నింగ్...!!
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. తన దైన శైలిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ నుంచి అమ్మాయిలను వేధించే వారి వరకు అన్నింటా కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. ప్రజల సురక్షితం జీవనానికి పీపుల్ వెల్ఫేర్ పోలీస్ విధానాన్ని తీసుకు వస్తున్నామని పేర్కొన్నారు. సీపీగా కొత్త సంస్కరణలు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేసారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
హైదరాబాద్ నగర నూతన సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు ఉన్న అనుభవంతో హైదరాబాద్ సీపీగా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు. టీం వర్క్‌కు మారుపేరు హైదరాబాద్ కమిషనరేట్ అని ప్రశంసించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని పండుగలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరిపామని తెలిపారు. హైదరాబాద్ పోలీసులు సెన్సేషనల్ కేసులు చేధించారని కొనియాడారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. పీపుల్స్, ఫ్రెండ్లీ పోలీసుకు తెలంగాణ పోలీసులు మారుపేరని కీర్తించారు. పీపుల్ వెల్ఫేర్ పోలీసుగా తయారు చేస్తామని ఉద్ఘాటించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య ఉందని చెప్పుకొచ్చారు. పీపుల్ వెల్ఫేర్ పోలీస్ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్దామని తెలిపారు.

విశ్వనగరంగా నిలుస్తున్న హైదరాబాద్ కు డ్రగ్స్ పెద్ద సమస్యగా సజ్జనార్ పేర్కొన్నారు. డ్రగ్స్‌పై, రౌడీ షీటర్‌లపై ఉక్కుపాదం మోపుతాం.. పీడీ యాక్టులు పెడతామని హెచ్చరించారు. అంతకు ముందు డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారి కేసులు పున: పరిశీలిస్తామని చెప్పారు. నిందితులకు సంబంధించిన డేటా బేస్ తయారు చేస్తామన్నారు. ఈగల్ టీంని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం కూడా డ్రగ్స్‌పై సీరియస్‌గా ఉందని చెప్పారు. డ్రగ్స్‌ని అరికట్టడమే హైదరాబాద్ పోలీసులు టాప్ ప్రయారిటీగా వెల్లడించారు. రోజుకో కొత్త రకం సైబర్ కేసులు నమోదు అవుతున్నాయన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, ప్రజలకు హాని కలిగించే యాప్‌లను ఎవరూ ప్రమోట్ చేయొద్దని కోరారు. ఆహారంలో కల్తీ చేసే గ్యాంగ్‌లపై ఉక్కుపాదం మోపుతామని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications