మూడు విడతల్లో స్థానిక ఎన్నికలు - షెడ్యూల్..పోలింగ్, ఫలితాలు ఇలా..!!

తెలంగాణ ఎన్నికల సంఘం స్థానిక సంస్థల పోలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు దశల్లో గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణ పైన నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ఓటర్లు 1.67 కోట్లకు పైగా ఉన్నారు. ఈ ఎన్నికలకు రూ. 350 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించింది ప్రభుత్వం . ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ.3.08 కోట్లు విడుదల చేసింది. 5,763 ఎంపీటీసీలు, 565 జడ్పీటీసీలకు కూడా ఓటింగ్ నిర్వహించనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం 11 గుర్తింపు పొందిన పార్టీలు పోటీ పడనున్నాయి.

అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్.. అదే రోజు నామినేషన్లు ప్రారంభమవుతాయని ఎస్ఈసీ తెలిపింది.. మొదటగా రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

SEC announces local body Election Schedule in Three phases Details here

తెలంగాణలోని 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తంగా 5749 ఎంపీటీసీలు.. 565 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా, మొత్తం గ్రామ పంచాయితీలు 12,733.. మొత్తం వార్డులు 1,12, 288కు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహణ పైన ప్రకటన చేసింది.

మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. అదే విధంగా అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. నవంబర్‌ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+