రెండో లిస్టు కూడా రెడీ?: వణికిపోతున్న టాలీవుడ్ ప్రముఖులు.. సంచలనమేనా?
విచారణలో భాగంగా.. సినిమావాళ్లు, డ్రగ్స్ కేసుతో లింకులున్న వ్యక్తులు వెల్లడించిన వివరాలను పరిగణలోకి తీసుకుని రెండో జాబితా సిద్దం చేసినట్లుగా చెబుతున్నారు.
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తొలి విడుత విచారణ తుది అంకానికి చేరుకుంది. సినీ ఇండస్ట్రీకి చెందిన మొత్తం 12మంది వ్యక్తులను సిట్ అధికారులు విచారిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో విచారణకు హాజరైనవారు వెల్లడించిన వివరాల ఆధారంగా రెండో జాబితా కూడా సిద్దం చేసినట్లు సమాచారం.
రెండో జాబితా కూడా సిద్దమైందన్న ప్రచారంతో పరిశ్రమకు చెందిన పలువురు బెంబేలెత్తిపోతున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ జాబితాలో ఇండస్ట్రీ ప్రముఖులకు చెందిన పిల్లలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తుండటంతో.. రెండో జాబితాపై తీవ్ర ఆసక్తి నెలకొంది. మరోవైపు తొలి విడుత విచారణ పట్ల సిట్ అధికారులు గనుక సంతృప్తి చెందకపోతే.. తొలి జాబితాలోని కొంతమంది మరోమారు విచారణ ఎదుర్కోక తప్పదు.

విచారణలో భాగంగా.. సినిమావాళ్లు, డ్రగ్స్ కేసుతో లింకులున్న వ్యక్తులు వెల్లడించిన వివరాలను పరిగణలోకి తీసుకుని రెండో జాబితా సిద్దం చేసినట్లుగా చెబుతున్నారు. వచ్చే వారం ఈ జాబితా వెలుగుచూసే అవకాశం ఉంది. కాగా, టాలీవుడ్ లో మొత్తం 40మందికి డ్రగ్స్ లింకులు ఉన్నట్లు తొలి నుంచి ప్రచారం జరుగుతోంది.
తొలి విడుతలో 12మంది ప్రముఖులకు నోటీసులు అందగా.. తదుపరి మరో 10మందికి నోటీసులు అందే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో డ్రగ్స్ కేసులో ఎక్కడ తమ పేరు వినాల్సి వస్తుందోనని పలువురు ప్రముఖుల పిల్లలు టెన్షన్ లో పడ్డట్లు తెలుస్తోంది. రెండో జాబితాలో వెల్లడించే పేర్లు సంచలనంగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది. వారిని కూడా సిట్ అధికారులు ఒక్కొక్కరిగా విచారించి వివరాలు రాబట్టనున్నట్లు చెబుతున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications