సంగారెడ్డిలో భూకంపం: భయంతో పరుగులు తీసిన జనం
సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూకంపం సంభవించింది. మంగళవారం రాత్రి 7.26 గంటల సమయంలో ఐదు సెకన్లపాటు భూమి కంపించింది. ఈ సమయంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. వరుసగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
పది రోజుల వ్యవదిలో రెండుసార్లు భు ప్రకంపనలు రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకుముందు జనవరి 27న న్యాల్కల్ మండలంలోని న్యాల్కల్, ముంగి గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిసింది.

ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం
ఆఫ్ఘనిస్థాన్‌లో మంగళవారం మరోసారి భూ కంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3గా తీవ్రత నమోదైంది. గత కొద్ది రోజులుగా వరుస భూకంపాలతో ఆఫ్ఘాన్ అల్లాడిపోతోంది. ప్రకంపనలు చోటు చేసుకుంటుండటంతో భయంతో ప్రజలు బయటకు పరులుగు తీస్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. మంగళవారం మద్యాహ్నం 3.17 నిమిషాలకు భూ కంపం సంభవించింది.
ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు సమాచారం లేదు. కాగా, జనవరి నెలలోనూ ఆఫ్ఘాన్ లో పలుమార్లు భూకంపాలు సంభవించాయి. తాజాగా ఈ నెల ప్రారంభంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications