దారుణం: మంత్రాల నెపంతో అన్నా, వదినలకు నిప్పంటించిన మరిది
శాస్త్ర సాంకేతిక రంగాల్లో మానవుడు అనేక విజయాలను సాధించినా ఇంకా మూఢ విశ్వాసాలను మాత్రం వీడడం లేదు. మంత్రాల నెపంతో స్వంత అన్నా, వదినపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ దుండగుడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన
దుబ్బాక:శాస్త్ర సాంకేతిక రంగాల్లో మానవుడు అనేక విజయాలను సాధించినా ఇంకా మూఢ విశ్వాసాలను మాత్రం వీడడం లేదు. మంత్రాల నెపంతో స్వంత అన్నా, వదినపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ దుండగుడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్యభర్తలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
సిద్దిపేట జిల్లాలో గురువారం సాయంత్రం దారుణం చోటుచేసుకొంది. చేతబడి చేస్తున్నారనే కారణంగా స్వంత అన్నా వదినలపై మరిది ఆయన భార్య తీవ్రంగా కొట్టి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సుదర్శన్, రాజేశ్వరి దంపతులు ఆయన సోదరుడు శ్రీనివాస్ పిల్లలకు చేతబడి చేస్తున్నారని ఇవాళ ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శ్రీనివాస్ ఆయన భార్య మంజులలు ఇతరులతో కలిసి సుదర్శన్ , రాజేశ్వరి దంపతులతో గొడవకు దిగారు. వారిని కరెంటు స్థంబానికి కట్టేసి తీవ్రంగా కొట్టారు.
అంతేకాదు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో సుదర్శన్, రాజేశ్వరి దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు.బాధితులను ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications