Telangana CS Shanti Kumari : తెలంగాణ తొలి మహిళా సీఎస్‍గా శాంతికుమారి..

తెలంగాణ నూతన సీఎస్ గా శాంతికుమారి నియామకమయ్యారు. ప్రస్తుతం సీఎస్ సోమేశ్ కుమార్ రిలీవ్ కావడంతో శాంతి కుమారిని తదుపరి సీఎస్ గా నియమించారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి మహిళా సీఎస్ గా శాంతి కుమారి రికార్డ్ సృష్టించారు.

సీఎస్ రేసులో సీనియర్ ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, రామకృష్ణరావు, రజత్ కుమార్, శాంతికుమారి, రాణి కుమిదిని, శశాంక్ గోయల్, వసుధా మిశ్రా, అశోక్ కుమార్, సునీల్ శర్మ ఉన్నారు. ఏపీకి చెందిన రామకృష్ణారావు సీఎస్ అయ్యే అవకాశం ఉందని అందరు భావించారు. కానీ శాంతి కుమారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు. శాంతికుమారి 1989 బ్యాచ్ కు చెందిన వారు.

Shantikumari as the new CS of Telangana..!

శాంతకుమారి గతంలో సీఎం కార్యాలయంలో పని చేశారు. శాంతకుమారి 2025 ఏప్రిల్ వరకు సీఎస్ గా కొనసాగనున్నారు.శాంతి కుమారి ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివారు. అమెరికాలో ఎంబిఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్ గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు.

ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా పని చేశారు. శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

హైకోర్టు ఆదేశాలతో సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్తారా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఆయన పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ లో సోమేశ్ కుమార్ పదవీకాలం పూర్తవనుంది. ఈ నేపథ్యంలో ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+