రేవంత్ రెడ్డికి షాక్: ఎర్రబెల్లి లేఖను ఆమోదించిన స్పీకర్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. తమ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి స్పీకర్ మధుసూదనాచారికి ఇచ్చిన లేఖకు ప్రాధాన్యం లేకుండా పోయింది.
తమను తెరాస సభ్యులుగా గుర్తించాలని కోరుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన లేఖను స్పీకర్ ఆమోదించారు. దాంతో టిడిపి నుంచి ఫిరాయించిన 12 మంది శాసనసభ్యులను స్పీకర్ తెరాస శాసనసభ్యులుగా స్పీకర్ గుర్తించారు. వారికి రేపు (శుక్రవారం) శాసనసభలో సీట్లు కేటాయించే అవకాశం ఉంది.

స్పీకర్ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. అది రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆయన అన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు 12 మంది శాసనసభ్యులు తెరాసలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా అరెకపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్ తెరాసలో చేరారు.
తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్ కృష్ణయ్య మాత్రమే మిగిలారు. దీంతో రేవంత్ రెడ్డి శాసనసభా పక్ష నేత హోదాను కూడా కోల్పోయే అవకాశం ఉంది. అసెంబ్లీ లాబీలోని టిడిఎల్పీ కార్యాలయాన్ని కూడా ఆయన ఖాళీ చేయాల్సి రావచ్చు.












Click it and Unblock the Notifications