భైంసాలో బీజేపీకి షాక్ .. ఎంఐఎం విజయం
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి . దాదాపు టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయంసాధించి తన పట్టు నిలుపుకుంది. ప్రతిపక్ష పార్టీలు క్రిందా మీదా పడినా అనుకున్న ఫలితాలు సాధించలేకపోయాయి. ఉత్కంఠ భరితంగా సాగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఊహించిన విధంగానే అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ల్లో అధికార టీఆర్‌ఎస్ . దూకుడు చూపించటంతో టీఆర్ఎస్ పార్టీలో జోష్ కనిపిస్తుంది. సంబరాలకు సిద్ధం అవుతున్నారు శ్రేణులు .
అయితే భైంసాలో మాత్రం బీజేపీ వర్సెస్ ఎంఐఎం హోరాహోరీ పోరు కొనసాగింది. చివరకు ఎంఐఎం సత్తా చాటింది. నిర్మల్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీపై ఎంఐఎం జెండా ఎగిరింది . హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం విజయం సాధించటం బీజేపీకి షాక్ అని చెప్పాలి . ఎన్నికల ముందు తీవ్ర ఘర్షణలతో వార్తల్లో నిలిచిన భైంసాలో మున్సిపల్ ఎన్నికల పోరు ఉత్కంఠ భరితంగా సాగింది .

భైంసాలో విజయం కోసం ఎంఐఎం, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డాయి. మొత్తం 26 వార్డుల్లో ఎంఐఎం 15 వార్డుల్లో గెలుపొందగా, బీజేపీ 9 స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రులు రెండు వార్డులను సొంతం చేసుకున్నారు. అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం కనీసం పోటీలో కూడా నిలవలేకపోయాయి. గత ఎన్నికల్లోనూ భైంసా మున్సిపాలిటీలో సొంత చేసుకున్న ఎంఐఎం మరోసారి అదే ఫలితాలను సాధించి పట్టు నిలబెట్టుకుంది. అయితే బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని 9 వార్డుల్లో విజయం నమోదు చేసింది.కానీ ఎంఐఎం ను మాత్రం ఓడించలేకపోయింది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications