జీవితంలో ఒక్కసారైనా ఈ రైల్వే స్టేషన్ కు వెళ్లిరండి
భారతీయ రైల్వే నెట్ వర్క్ పరంగా ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. కానీ త్వరలోనే ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకోబోతోంది. అందుకు ఎంతో సమయం కూడా పట్టదు. శరవేగంగా దేశంలో రైల్వేలైను లేని ప్రాంతాలకు కొత్తగా లైన్లు నిర్మాణం జరుపుకుంటున్నాయి. ప్రతిరోజు 13,600 రైళ్లు కోటిమందికిపైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. కరోనా సమయంలో కొన్ని చిన్న చిన్న రైల్వేస్టేషన్లను భారతీయ రైల్వే తీసేసింది. అయితే ప్రయాణికుల నుంచి డిమాండ్లు అధికంగా ఉండటంతో వాటిని పునరుద్దరించుకుంటూ వస్తోంది. ఎందుకంటే ఆయా రైల్వేస్టేషన్లతో స్థానికులకు విడదీయరాని బంధం ఏర్పడివుంటుంది. ఆ బంధాన్ని వారు అంత త్వరగా తెంచుకోలేరు.
సింగాబాద్ కు ప్రత్యేక చరిత్ర
మన దేశంలో ఉన్న ప్రతి రైల్వేస్టేషన్ కు ఒక్కో ఘనమైన చరిత్ర ఉంటుంది. ఈ క్రమంలోనే భారతదేశ చివరి రైల్వేస్టేషన్ అయిన సింగాబాద్ కు ప్రత్యేక చరిత్ర ఉంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఉన్న ఈ స్టేషన్ మల్దా జిల్లా హబీబ్ పూర్ కు సమీపంలో ఉంటుంది. అక్కడి నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు ప్రారంభం కావడంతో దీన్ని మనదేశపు చివరి రైల్వేస్టేషన్ గా పరిగణిస్తారు. ఇక్కడి స్టేషన్ కు ప్రయాణికుల రైళ్లు రాకపోయినప్పటికీ సరకు రవాణా చేసే గూడ్స్ రైళ్లు మాత్రం వస్తుంటాయి. భారతదేశ స్వాతంత్ర్య పోరాట ఘట్టంలో సింగాబాద్ కూడా చోటు దక్కించుకుంది.

గాంధీజీ ఈ స్టేషన్ మీదుగానే వెళ్లేవారు
దేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఢాకా వెళ్లాలంటే జాతిపతి మహాత్మా గాంధీజీతోపాటు సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి సమర యోధులు ఈ స్టేషన్ మీదుగానే వెళ్లేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సరకు రవాణాలో ఎగుమతులు, దిగుమతుల కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు. ఈ స్టేషన్ లో ఉద్యోగులు ఉన్నారు. వీరికి ప్రయాణికుల రైళ్లకు సంబంధించిన విధులు ఉండనప్పటికీ గూడ్స్ రైళ్లకు సంబంధించిన విధులు ఉంటాయి. భారత్-బంగ్లాదేశ్ మధ్య సృహద్భావ సంబంధాలు నెలకొనడంతో సరకు రవాణా ఈ మార్గంద్వారా సాగుతుంటుంది. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ స్టేషన్ నుంచి ప్రయాణికుల కోసం రైళ్లను నడపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారుకానీ భారతీయ రైల్వే అధికారులు మాత్రం స్పందించడంలేదు.












Click it and Unblock the Notifications