బ్రహ్మంగారి లాగే: కెసిఆర్‌పై స్పీకర్ సిరికొండ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిని నిత్యం స్మరించుకుంటే భవిష్యత్తులో ముందుకు పోగలుగుతామన్నారు. బ్రహ్మంగారు తెలుగుగడ్డపై జన్మించడం మన అదృష్టమని, మనకు గర్వకారణమని అన్నారు. బ్రహ్మంగారు గొప్ప దార్శనికుడని అన్నారు. ఆచార్య జయశంకర్, కెసిఆర్‌లను బ్రహ్మంగారితో పోల్చారు.
1952-53లో తెలంగాణను ఆంధ్రారాష్ట్రంతో కలిపే ప్రతిపాదనలను జయశంకర్ వ్యతిరేకించారని, అంతేగాక దీనివల్ల భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను అప్పుడే వివరించారనీ గుర్తు చేశారు. కెసిఆర్ కూడా రాష్ట్రం సాధించుకోవడం తథ్యమని చెప్పి రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, దాసరి మనోహర్ రెడ్డి, కలెక్టర్ వీరబ్రహ్మయ్యలు పాల్గొన్నారు.
బోవెరా ఆశయాలు కొనసాగిస్తాం: కొడుకు హన్మంతరావు
కరీంనగర్: దివంగత స్వాతంత్ర సమరయోధుడు బోయినపల్లి వెంకట్రామారావు ఆశయాలను కొనసాగిస్తామని ఆయన కుమారుడు బోయినపల్లి హన్మంత రావు అన్నారు. సోమవారం ఆయన బోవేరా భవన్‌లో మీడియాతో మాట్లాడారు. యువతలో ఉత్తేజం నింపేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని, రీడింగ్ రూమ్, ధ్యాన మందిరం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఎలాంటి స్వార్థం లేకుండా దేశం కోసం తన తండ్రి త్యాగం చేశారని చెప్పారు. తన తండ్రే గాకుండా తల్లి కూడా స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారని తెలిపారు. 1935లో చేపట్టిన భూదాన్ ఉద్యమంలో భాగంగా జిల్లాలో మొదటిసారిగా తోటపల్లి నుంచే భూదాన ఉద్యమం చేపట్టారన్నారు.
అందులో భాగంగా తమకు చెందిన భూములను గ్రామంలో పేదలకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేసి దానిని కేంద్రంగా చేసుకుని నిజాం వ్యతిరేక పోరాటం చేశారని తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వ హించడం, ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రావడాన్ని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications