Cyber Crime: ఒక్కో లైక్‍కు రూ.50 అంటూ.. రూ.75 లక్షలు కొల్లగొట్టారు..
యూట్యూబ్‍లో ఒక్కో లైక్‍కు రూ.50 ఇస్తామని రూ.75 లక్షలు కొల్లగొట్టారు.
ఇంటర్నేట్ చౌకగా ఉండడంతో ప్రస్తుతం సోషల్ మీడియాను విరిగా వాడుతున్నారు. ముఖ్యంగా యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ ఎక్కువగా వడుతున్నారు. యూట్యూబ్ అయితే మరి ఎక్కువగా వాడుతున్నారు. అయితే దీన్నే ఆదాయ వనరుగా మార్చుకుని చాలా మంది ఉపాధి పొందుతున్నారు. అంతా బాగానే ఉన్న తాజాగా యూట్యూబ్ లోని వీడియోకు ఒక్కో లైక్ కు రూ.50 ఇస్తున్నారు. అయితే లైక్ కొట్టగానే అకౌంట్లో డబ్బులు పడుతుండడంతో చాలా మంది లైకుల మీద లైకులు కొట్టి చివరికి లక్షల్లో మోసపోయారు.

రూ.75 లక్షలు
ఆరుగు నుంచి ఇలా సుమారు రూ.75 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు చివరికి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ లోని భరత్ నగర్ కు చెందిన ఓ యువకుడు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అదే సమయంలో అతనికి పార్ట్ టైం జాబ్ ఉందని వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. ఇది నిజమేనని నమ్మిన అతను మెసేజ్ లో మెన్షన్ చేసిన మొబైల్ నంబర్ కు ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తికి ఫోన్ లిఫ్ట్ చేసి వివరాలు అడిగాడు.

రూ.25 లక్షలు
యువకుడు అన్ని వివరాలు చెప్పాడు. అయితే అవతలి వ్యక్తి జాబ్ వచ్చేలోపు తాము పంపే యూట్యూబ్ వీడియోలకు లైక్ కొట్టాలని.. ఒక్కో లైక్ కు రూ.50 చెల్లిస్తామని చెప్పారు. వారు కొన్ని యూట్యూబ్ లింక్ పంపారు. అతను వాటిని ఓపెన్ చేసి లైకులు కొట్టాడు. దీంతో అతనికి డబ్బులు కూడా చెల్లించాడు. కొద్దిరోజులు ఇలా సాగింది. దీంతో యువకుడికి, డబ్బు చెల్లించే వారికి సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో వారు తమ కంపెనీల్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని యువకుడిని నమ్మించారు. అతడి నుంచి పలు దశల్లో రూ.25 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత ఫోన్ స్వీచ్చాప్ చేసుకున్నారు.

రూ.10 లక్షలు
ఇదే తరహాలో యూసఫ్‌గూడ వాసి నుంచి రూ.10 లక్షలు, మలక్‌పేట వాసి నుంచి రూ.4 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ.2 లక్షలు కాజేశారు. అలాగే హైదరాబాద్ కు కొత్తగా వచ్చిన ఓ రైతుకు అపరిచితులు ఫోన్ చేసి తమ కంపెనీలో పెట్టుబడి పెడితే కోట్లు సంపాదించవచ్చని చెప్పారు. ఇలా రైతు నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత ముఖం చాటేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుల నుంచి ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.












Click it and Unblock the Notifications