SLBC Tunnel: రంగంలోకి రోబోలు!

SLBC Tunnel: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం సొరంగంలో 8 మంది సిబ్బంది గల్లంతైన నేపథ్యంలో సహాయక చర్యలను పరిశీలించేందుకు మంత్రులతో కలిసి సీఎం రేవంత్ టన్నెల్ లోనికి వెళ్లారు. ఆ తర్వాత ఎస్ఎల్‌బీసీ వద్ద అన్ని విభాగాల అధికారులు, ఏజెన్సీలు, రెస్క్యూ టీంలతో సహాయక చర్యలపై సమీక్షించారు.

అనంతరం సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ను 200506లో ప్రారంభించారని తెలిపారు. 2014 తెలంగాణ ఏర్పడేనాటికి 32 కిలోమీటర్ల టన్నెల్ పూర్తయిందన్నారు. అయితే, గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్‌బీసీని పట్టించుకోలేదన్నారు. ఈ పనులు చేస్తున్న సంస్థ విద్యుత్ బిల్లులు చెల్లించలేదని విద్యుత్ సరఫరా కూడా నిలిపివేసిందన్నారు. దీంతో గత పదేళ్లుగా టన్నెల్ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని సీఎం రేవంత్ తెలిపారు.

SLBC Tunnel CM Revanth orders use of robots in rescue operations

నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాంతానికి కృష్ణా జలాలు అందించాలని నిర్ణయించామని.. అందుక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆగిపోయిన ఈ ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభించామని రేవంత్ చెప్పారు. అయితే, అనుకోకుండా ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు.

జాతీయ స్థాయిలో నిపుణులైన 11 కేంద్ర సంస్థలు, ప్రైవేటు ఏజెన్సీలు 9 రోజులుగా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గల్లంతైన 8 మంది ఆచూకీ ఇప్పటి వరకూ తెలియరాలదన్నారు. ఈ ఆపరేషన్ కొలిక్కి రావడానికి మరో రెండు మూడు రోజులు సమయం పడుతుందన్నారు. కన్వేయర్ బెల్ట్ పాడవడం వల్ల సిల్టు తొలగించేందుకు ఆటంకమేర్పడిందన్నారు.

SLBC Tunnel CM Revanth orders use of robots in rescue operations

సోమవారం సాయంత్రానికి కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తుందని.. దీంతో మట్టి బురదను వేగంగా తొలగించవచ్చని సీఎం రేవంత్ తెలిపారు. సొరంగంలో గల్లంతైన కుటుంబాలకు అన్ని పార్టీలు అండగా ఉండాలన్నారు. ఎలాంటి ప్రాణన్టం ఉండకూడదనే ఉద్దేశంతో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో మనుషులు, మిషిన్లతోపాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. టన్నెల్ బాధితులను బయటికి తీయడంలో ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యం చేయడం లేదని సీఎం రేవంత్ చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+