బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్: మునుగోడులో టీఆర్ఎస్ నకిలీ ఓట్లు, భారీ బైక్ ర్యాలీలు

హైదరాబాద్: తెలంగాణ‌లో ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో బీజేపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికపై కూడా చర్చ జరిగింది.

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం


తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా సునీల్ బన్సల్ నేతలకు సూచించారు. మునుగోడులో రణనీతి అవలంబించాలని కేంద్ర ప్రభుత్వ పథకాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అక్టోబర్ 7న మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో బైక్ యాత్రలు చేపట్టనున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి తెలిపారు.

బైక్ ర్యాలీలు.. టీఆర్ఎస్ నకిలీ ఓటర్లపై..

బైక్ ర్యాలీలు.. టీఆర్ఎస్ నకిలీ ఓటర్లపై..

అక్టోబర్ 10వ తేదీన బూత్ కమిటీ సభ్యులతో బండి సంజయ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నట్లు వివేక్ పేర్కొన్నారు. కోర్ కమిటీ సమావేశంలో బైక్ యాత్రలో పాల్గొననున్న స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల ఇంఛార్జ్‌లు, పార్టీ ముఖ్యనేతలు.. బూత్ కమిటీలను వెంటనే పూర్తి చేయాలని జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సూచించారని వివేక్ తెలిపారు. టీర్ఎస్ మునుగోడులో నకిలీ ఓటర్లను నమోదు చేయిస్తోందని మాజీ ఎంపీ వివేక్ పేర్కొన్నారు. దీంతో నియోజకవర్గ ఓటర్ లిస్టును వెరిఫికేషన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

బీజేపీ నేతలపై అక్రమ కేసులకు లీగల్ సెల్‌తో కౌంటర్

బీజేపీ నేతలపై అక్రమ కేసులకు లీగల్ సెల్‌తో కౌంటర్

కేసీఆర్ అవినీతి, అసమర్థ పాలనను గ్రామగ్రామాన వివరించాలన్నారు. ప్రచారం ఎలా చేయాలి? ప్రజల్లోకి బీజేపీ గుర్తును ఎలా తీసుకెళ్లాలనే అంశంపై చర్చించామని వివేక్ వెంకటస్వామి చెప్పారు. అక్రమ కేసులను ఎదుర్కొంటున్న బీజేపీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, విజయశాంతి సహా రాష్ట్ర ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. దీక్షలో ఉన్నందున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశానికి రాలేదు. అల్లుడు చనిపోవడంతో డీకే అరుణ కూడా కోర్ కమిటీ భేటీకి హాజరు కాలేకపోయారు. కాగా, బీజేపీ తరపున మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+